తెలుగు న్యూస్ / ఫోటో /
Death Settlement: జీవిత బీమా పాలసీ దారుడు ఆత్మహత్యకు పాల్పడినా., సహజ మరణంలోనైనా పరిహారం పొందడం ఎలా?
- Death Settlement: బీమా పరిహారాన్ని సెటిల్ చేసే సమయంలో ఇన్స్యూరెన్స్ కంపెనీలు రకరకాల సాకులు చెప్పి పరిహారాన్ని ఎగవేయడానికి, కుదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. పాలసీ చెల్లించే సమయంలోనే వీటిపై రాతపూర్వకంగా స్పష్టత తీసుకోవడం ఉత్తమం. తమ తర్వాత నామినీలకు వాటిపై అవగాహన కల్పించాలి.
- Death Settlement: బీమా పరిహారాన్ని సెటిల్ చేసే సమయంలో ఇన్స్యూరెన్స్ కంపెనీలు రకరకాల సాకులు చెప్పి పరిహారాన్ని ఎగవేయడానికి, కుదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. పాలసీ చెల్లించే సమయంలోనే వీటిపై రాతపూర్వకంగా స్పష్టత తీసుకోవడం ఉత్తమం. తమ తర్వాత నామినీలకు వాటిపై అవగాహన కల్పించాలి.
(1 / 8)
బీమా పాలసీ తీసుకున్న ప్రారంభ తేదీ నుంచి ఏడాదిలోపు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం చెల్లించరు. పాలసీ జారీకి బీమా కంపెనీ ప్రకటించిన అండర్ రైటింగ్ తేదీని బీమా పాలసీ తేదీగా పరిగణిస్తారు. పాలసాదారుడు ఏ కారణంతో మరణించినా పాలసీ కాంట్రాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి. కొన్ని సార్లు పాలసీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకపోయినా బీమా కంపెనీలు ఉదారంగా ఎక్స్‌గ్రేషియా క్లెయిం సెటిల్ చేస్తాయి.
(2 / 8)
బీమా పాలసీ తీసుకున్ని రెండేళ్ల పాటు ప్రీమియం చెల్లించి, తర్వాత ప్రీమియం చెల్లింపు గడువు తేదీ నుంచి మూడు నెలల పాటు ప్రీమియం చెల్లించకపోయినా పాలసీదారుడు మరణిస్తే అప్పటి వరకు ఉన్న బోనస్‌తో పాటు పూర్తి బీమా పరిహారాన్ని చెల్లిస్తారు.
(3 / 8)
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న రెండేళ్ల పాటు ప్రీమియం చెల్లించి, తర్వాత ప్రీమియంను గడువు తేదీ నుంచి మూడు నెలల దాటిన తర్వాత ఆర్నెల్లలోపు చెల్లించకుండా, పాలసీదారుడు ఏ కారణంతో చనిపోయినా అప్పటి వరకు ఉన్న బోనస్ చెల్లించరు. బీమా మొత్తంలో సగం మాత్రమే నామినీకి చెల్లిస్తారు.
(4 / 8)
ఇన్సూరెన్స్ పాలసీలో రెండేళ్ల పాటు ప్రీమియం చెల్లించి, తర్వాత ప్రీమియం ఆర్నెల్ల నుంచి ఏడాది లోపు చెల్లించకపోతే బోనస్‌ను చెల్లించరు. బీమా మొత్తంలో నోషనల్ పెయిడ్ అప్ వాల్యూ లెక్కించి పరిహారం చెల్లిస్తారు. దీనిని అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంను బీమా మొత్తంతో గుణించి చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలతో భాగిస్తారు.
(5 / 8)
పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే పంచనామా రిపోర్ట్, ఎఫ్‌ఐఆర్ కాపీ, పోప్ట్‌మార్టమ్ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.
(6 / 8)
ప్రమాదాలు, ఆత్మహత్యల కేసుల్లో సెటిల్‌మెంట్ చేసుకోడానికి అవసరమైన అన్ని రకాల పత్రాలను చదవడానికి అనువుగా ఉన్న వాటిని సమర్పించాల్సి ఉంటుంది.
(7 / 8)
బీమా క్లెయిమ్‌లను తిరస్కరించడానికి కూడా కంపెనీలకు అధికారం ఉంటుంది. డెత్ క్లెయిమ్ విషయంలో నిబంధనలకు అనుగుణంగా లేకపోతే క్లెయిమ్ తిరస్కరించే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది. పాలసీదరఖాస్తుల్లో బీమా కంపెనీకి అవసరమైన సమాచారాన్నిముందస్తుగా ఇవ్వకపోయినా క్లెయిమ్ తిరస్కరించవచ్చు. వివరాలు దాచినా, వక్రీకరించి చెప్పినా, పాలసీ క్లెయిమ్ సమయంలో అవి రుజువు అయితే వాటిని తిరస్కరించవచ్చు.
ఇతర గ్యాలరీలు