'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్ - 'వాట్సాప్'లో మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-how to check the status of the thalliki vandanam scheme on manamitra whatsapp ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్ - 'వాట్సాప్'లో మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

'తల్లికి వందనం స్కీమ్' అప్డేట్ - 'వాట్సాప్'లో మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Published Jun 14, 2025 10:52 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 14, 2025 10:52 AM IST

ఏపీలో ‘తల్లికి వందనం స్కీమ్’ డబ్బులు జమవుతున్నాయి. మొత్తం రూ. 15 వేలు కాగా…తల్లి ఖాతాలోకి రూ. 13 వేలు వేస్తున్నారు. మరో రూ. 2 వేలు పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు పడ్డాయా లేదా అనేది ‘మనమిత్ర వాట్సాప్’ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని పట్టాలెక్కించింది. గురువారం నుంచే తల్లుల ఖాతాలోకి డబ్బులను జమ చేయడాన్ని ప్రారంభించింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

(1 / 7)

తల్లికి వందనం పథకం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు రూ. 13 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. మరో రూ. 2 వేలను స్కూళ్ల అభివృద్ధికి కేటాయిస్తోంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన స్టేటస్ ను మనమిత్ర వాట్సాప్ లోనూ తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది.

(2 / 7)

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో Hi అని మేసేజ్ చేయాలి.

(3 / 7)

సేవల ఆప్షన్ పై నొక్కాలి. ఆ తర్వాత ప్రభుత్వ సేవలు కనిపిస్తాయి. ఇందులో తల్లికి వందనం స్కీమ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టేటస్ ఆప్షన్ పై నొక్కి... తల్లి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలిసిపోతుంది.

(4 / 7)

ఇక మనమిత్ర వాట్సాప్ ద్వారానే కాకుండా… https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ప్రత్యేక లింక్ ద్వారా కూడా తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

(5 / 7)

వెబ్ సైట్ లోకి వెళ్లి తర్వాత… స్కీమ్ ఆప్షన్ లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం దగ్గర 2025-2026 ను ఎంపిక చేసుకోవాలి. ఆ పక్కన ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

(6 / 7)

మరోవైపు గ్రామ సచివాలయాల్లో తల్లికి వందనం స్కీమ్ అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పునఃపరిశీలిస్తారు. అర్హులైన వారిని గుర్తిస్తారు. మరో జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.గ్రీవెన్స్ లో పరిశీలన పూర్తి అయిన తర్వాత… అర్హులను గుర్తిస్తారు. ఈ అదనపు జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులను జమ చేస్తారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు