(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తులను పరిశీలించిన అధికారులు…. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రెండో విడత కింద అన్ని గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
(2 / 8)
ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అనుర్హులకు ఎట్టి పరిస్థితులను మంజారు చేయవద్దని… అలా చేసినట్లు తేలితే చర్యలు ఉంటాయని కూడా చెప్పింది.
(3 / 8)
ఈ స్కీమ్ అమలులో పారదర్శకతకు పెద్దపీఠ వేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తోంది. మరోవైపు దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేస్తూ… ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని అధికారులకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేసింది.
(4 / 8)
ఈ స్కీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని మూడు జాబితాలుగా వర్గీకరించారు. అయితే వీటిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమకు స్థలం ఉన్నప్పటికీ ఎల్ 1లో కాకుండా ఎల్ 2 నమోదు చేశారని పేర్కొన్నారు. పేర్ల నమోదే కాకుండా… వివరాల నమోదు, ఫొటోల అప్ లోడ్ వంటి అంశాలకు సంబంధించి గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటి స్టేటస్ వివరాలను కూడా తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకువచ్చింది.
(5 / 8)
ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ http://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదు చేసినాళ్లు…. ఈ వెబ్ సైట్ లో కనిపించే గ్రీవెన్స్ ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ క్లిక్ చేస్తే Grievance Entry,Grievance search అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. గ్రీవెన్స్ సెర్చ్ పై క్లిక్ చేసి Grievance Id లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తీ మీ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఫిర్యాదు ఏ స్థితిలో ఉంది..? అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న వివరాలు కూడా అప్డేట్ అవుతుంటాయి.
(6 / 8)
దరఖాస్తుదారుి ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా సమాచారం అందుతాయి. లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోవచ్చు.
(HT Telugu)(7 / 8)
గ్రామాల్లో ఎంపీడీవో ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు సమాచారం చేరుతుంది. ఇక పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేరుతుంది. వీటిని పరిశీలించి… అధికారులు చర్యలు తీసుకుంటారు.
(8 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కు సంబంధించి ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. 040-29390057 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చు
ఇతర గ్యాలరీలు