'తల్లికి వందనం' స్కీమ్ డబ్బులు పడ్డాయా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-how to check the status of ap govt thalliki vandanam scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'తల్లికి వందనం' స్కీమ్ డబ్బులు పడ్డాయా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

'తల్లికి వందనం' స్కీమ్ డబ్బులు పడ్డాయా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Published Jun 13, 2025 03:28 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 13, 2025 03:28 PM IST

‘తల్లికి వందనం’ స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు రూ. 13 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. మరో రూ. 2 వేలను స్కూళ్ల అభివృద్ధికి కేటాయిస్తోంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన స్టేటస్ కూడా తెలుసుకునే వీలు ఉంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం… తల్లికి వందనం స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. తల్లుల ఖాతాలోకి డబ్బులు జమవుతున్నాయి. లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.

(1 / 7)

తల్లికి వందనం స్కీమ్ తెలుసుకునేందుకు ముందుగా లబ్ధిదారులు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

(2 / 7)

వెబ్ సైట్ లోకి వెళ్లి తర్వాత…  స్కీమ్ ఆప్షన్ లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం దగ్గర 2025-2026 ను ఎంపిక చేసుకోవాలి. ఆ పక్కన ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

(3 / 7)

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

(4 / 7)

గ్రామ సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పునఃపరిశీలిస్తారు. అర్హులైన వారిని గుర్తిస్తారు. మరో జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

(5 / 7)

గ్రీవెన్స్ లో పరిశీలన పూర్తి అయిన తర్వాత… అర్హులను గుర్తిస్తారు. ఈ అదనపు జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులను జమ చేస్తారు.

(6 / 7)

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ను వర్తింపజేస్తారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 70 వేలకుపైగా ఉంది.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు