తెలుగు న్యూస్ / ఫోటో /
TG ePASS Scholarship Status : విద్యార్థులకు అలర్ట్... మీ స్కాలర్షిప్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!
- TS ePASS Scholarship Updates 2024 : తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ గడువు ఇటీవలనే పూర్తయింది. అయితే విద్యార్థులు.. వారి వివరాలతో ఎప్పటికప్పుడు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్కాలర్ షిప్ దరఖాస్తు ఏ దశలో ఉందనేది తెలుసుకోవచ్చు. ప్రాసెస్ ఎలానో ఇక్కడ చూడండి…
- TS ePASS Scholarship Updates 2024 : తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ గడువు ఇటీవలనే పూర్తయింది. అయితే విద్యార్థులు.. వారి వివరాలతో ఎప్పటికప్పుడు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్కాలర్ షిప్ దరఖాస్తు ఏ దశలో ఉందనేది తెలుసుకోవచ్చు. ప్రాసెస్ ఎలానో ఇక్కడ చూడండి…
(1 / 7)
తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఇటీవలనే పూర్తయింది. దీంతో 2024-25 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్ ప్రక్రియ ముగిసినట్లు అయింది.
(2 / 7)
స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవటంతో పాటు రెన్యూవల్ చేసుకున్న విద్యార్థులు… వారి అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వీలుంటుంది. చాలా సింపుల్ గా ఆన్ లైన్ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
(3 / 7)
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ Post Matric Scholarship Services , Pre Matric Scholarship Services ఆప్షన్లు కనిపిస్తాయి.
(4 / 7)
ఆ తర్వాత మీకు స్కాలర్షిప్ పేజీతో కూడిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ 'Know Your Application Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ లేదా ప్రీ మెట్రిక్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
(5 / 7)
మీ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'Get Status' పై క్లిక్ చేయాలి. చివరగా మీ ePASS స్కాలర్షిప్ స్టేటస్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
(6 / 7)
https://telanganaepass.cgg.gov.in/applicationStatu లింక్ తో స్కాలర్ షిప్స్ స్టేటస్ నేరుగా చెక్ చేసుకోవచ్చు. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి స్కాలర్ షిప్స్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
(7 / 7)
ఇక 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్ షిప్స్ దరఖాస్తుల గడువును పెంచాలని చాలా మంది విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా లాసెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు.. స్కాలర్ షిప్స్ దరఖాస్తు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు చాలా ఆలస్యంగా సీట్లు కేటాయించారని…దీంతో స్కాలర్ షిప్స్ కు అప్లికేషన్ చేసుకోలేకపోయామని చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు