అన్నదాత సుఖీభవ స్కీమ్ - అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-how to check ap govt annadata sukhibhava scheme application status know these steps ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అన్నదాత సుఖీభవ స్కీమ్ - అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

అన్నదాత సుఖీభవ స్కీమ్ - అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Published May 17, 2025 07:01 AM IST Maheshwaram Mahendra Chary
Published May 17, 2025 07:01 AM IST

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. సంబంధిత పోర్టల్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ పథకం స్కీమ్ కింద ఏపీలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.

(1 / 9)

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

(2 / 9)

అర్హులైన రైతులు భూమి పాస్ బుక్, ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించి అప్లయ్ చేసుకోవచ్చు.  రైతు సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలించిన తర్వాత…. వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు.  రైతుసేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్‌ ల్యాండ్‌ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి…. అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ స్కీమ్ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.

(3 / 9)

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ స్కీమ్ కు అప్లికేషన్ చేసుకుంటున్నారు. అర్హులైన రైతులు మే 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లు… ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు ఉంటుంది.

(4 / 9)

ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/  లోకి వెళ్లాలి.  హోంపేజీలో కనిపింటే  'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.  ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

(5 / 9)

ఆన్ లైన్ పోర్టల్ లో మాత్రమే కాకుండా ఆఫ్ లైన్ లోనూ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదిస్తే…. వారి లాగిన్ ద్వారా స్టేటస్ చెక్ చేస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించే వీలు ఉంటుంది.

(6 / 9)

అన్నదాత సుఖీభవ పథకం కోసం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని అమలు చేస్తున్నారు. అంటే భార్య, భర్త, పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. కొత్తగా పెళ్లయిన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారు.

(7 / 9)

ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మే 20లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వివరాల పరిశీలన తర్వాత తుది జాబితాలను అందుబాటులో ఉంచుతారు. జూన్ మాసంలో ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశం ఉంటుంది.

(8 / 9)

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

(9 / 9)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు