
(1 / 8)
టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. డ్రైవర్ కొలువులు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి.

(2 / 8)
ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. అయితే ఇదే వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

(3 / 8)
అర్హతలు కలిగిన అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో డ్రైవర్, శ్రామిక్ నోటిఫికేషన్ 2025 అని కనిపిస్తుంది. దీని కిందనే అప్లయ్ ఆన్ లైన్ అనే లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

(4 / 8)
ముందుగా మీ ప్రాథమిక వివరాలతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను ఎంట్రీ చేయాలి.

(5 / 8)
ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు రూ.200, ఇతరులు అయితే రూ.400 దరఖాస్తు ఫీజు ఉంటుంది.

(6 / 8)
అప్లికేషన్ ప్రక్రియ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా టెన్త్ మెమో, ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణపత్రంతో పాటు మరికొన్ని వివరాలకు సంబంధించిన పత్రాలు ఉండాలి.

(7 / 8)
ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ (గ్రేడ్ 1,2,3) ప్రకారం కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తాజానే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

(8 / 8)
ఫిజికల్ మెజర్‌మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం డ్రైవర్ పోస్టులకు నెలకు రూ. 20,960 నుంచి రూ.60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 జీతం దొరుకుతుంది.
ఇతర గ్యాలరీలు