Cricket Umpires Salaries: క్రికెట్‌లో అంపైర్ల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?-how much do umpires earn for officiating umpires salary bonus in ipl odi t20 test matches ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How Much Do Umpires Earn For Officiating Umpires Salary Bonus In Ipl Odi T20 Test Matches

Cricket Umpires Salaries: క్రికెట్‌లో అంపైర్ల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?

May 14, 2023, 01:28 PM IST Maragani Govardhan
May 14, 2023, 01:28 PM , IST

  • Cricket Umpires Salaries: క్రికెట్‌లో అంపైర్లు/రిఫరీలు చాలా కీలకం. మైదానంలో వారి పాత్రల చాలా పెద్దది. అయితే అంపైర్‌గా మారాలంటే ఏం చేయాలి? ఎలా మారాలి? అందుకు ఎలాంటి అర్హతలుండాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

ముందుగా అంపైర్‌గా మారాలంటే ఏం చేయాలి? ఎలాంటి నైపుణ్యాలు కావాలి?బీసీసీఐ, ఐసీసీ, ఐపీఎల్ అంపైర్ల జీత భత్యాలు ఎలా ఉంటాయి? వారి వయోపరిమితి ఎంత వరకు ఉండాలి? ఇందుకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

(1 / 10)

అంపైర్లకు ఏయే నైపుణ్యాలు ఉండాలి?అంపైర్ కావడానికి విద్యార్హత తప్పనిసరి కాదు. అయితే చదవడం, రాయడం బాగా తెలిసుండాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు అంపైర్ కావాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి. వీటితో పాటు ఫిట్‌నెస్, కంటి చూపు, వినికిడి సామర్థ్యం లాంటి బాగుండాలి. 

(2 / 10)

అంపైర్‌గా ఎలా మారాలి?అంపైర్ కావడానికి రాతపూర్వక, ప్రాక్టీకల పరీక్షలు ఉంటాయి. వీటిని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు ఈ టెస్టును నిర్వహించనున్నాయి. పరీక్షకు ముందు 4 రోజుల శిక్షణ ఉంటుంది. 3 రోజుల తర్వాత 42 నియమాలపై ట్రైనింగ్ చివరి రోజున పరీక్షను నిర్వహిస్తారు.

(3 / 10)

ఈ పరీక్షలు 3 రౌండ్లలో జరుగుతుంది. మొదటిగా రాతపూర్వక పరీక్ష ఉంటుంది. ఉక్కడ ఉత్తీర్ణులైన వారు ప్రాక్టీకల పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆ తర్వాత వైవా పరీక్షకు అర్హలవుతారు. అక్కడ కూడా అర్హత సాధిస్తే రాష్ట్ర స్థాయి అంపైర్ అవుతారు. 

(4 / 10)

బీసీసీఐ అంపైర్‌గా ఎలా మారాలి?బీసీసీఐ స్థాయిలో లెవల్-1 ప్రోగ్రామ్, రిఫ్రెషర్ కోర్సు ఉంటుంది. లెవల్-1 ప్రోగ్రామ్ పూర్తయిన సంవత్సరం లోపు రిఫ్రెషర్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో అంపైర్‌గా సేవలందించవచ్చు.

(5 / 10)

అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ జీతం ఎంత?దేశవాళీ క్రికెట్ అంపైర్ల కంటే ఐసీసీ అంపైర్లకు ఎక్కువ వేతనం ఇస్తారు. అనుభవజ్ఞులైన, టాప్ అంపైర్లకు 45 వేల డాలర్ల వార్షిక వేతనం ఉంటుంది. అంటే 35 లక్షల రూపాయలకు పైమాటే. కనిష్ఠంగా 35 వేల డాలర్లకు ఉంటుంది. అంటే 25 లక్షల వరకు ఉంటుంది.

(6 / 10)

వార్షిక వేతనాలు కాకుండా ప్రతి మ్యాచ్‌కు జీతం ఉంటుంది. అనుభవజ్ఞులు, ఫ్రెషర్లకు ప్రతి టెస్టు మ్యాచ్‌కు 5 వేల డాలర్లు(4 లక్షలకు పైగా), వన్డేకు 3 వేల డాలర్లు(2.50 లక్షలకు పైగా), టీ20 క్రికెట్‌కు 1500 డాలర్లు(1.25 లక్షలకు పైగా) చెల్లిస్తారు.

(7 / 10)

ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌లో ఒక్కో మ్యాచ్‌కు 3 వేల డాలర్లు చెల్లిస్తారు. ఈ జీతంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఐసీసీ స్వయంగా చెల్లిస్తుంది. ఏడాదికి ఓ సారి వెకేషన్‌కు వెళ్లే అవకాశం కూడా ఇస్తుంది.

(8 / 10)

ఐపీఎల్‌లో అంపైర్లకు కూడా ఒక్కో మ్యాచ్‌కు 2800 డాలర్లు చెల్లిస్తారు. ఐసీసీ ద్వారా గుర్తింపు పొందిన అంపైర్లు ఐపీఎల్‌లో విధులు నిర్వహిస్తారు.

(9 / 10)

అంపైర్ల వయోపరిమితి?అంపైర్‌గా నియామకం కావాలంటే కనీసం 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. బీసీసీఐ నిర్వహించే లెవల్-1లో పాల్గొనేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 40 ఏళ్ల లోపు వారై ఉండాలి. బీసీసీఐ లెవల్-2 పరీక్షలో పాల్గొనాలంటే 45 ఏళ్లకు మించకూడదు. అంపైర్ల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు.

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు