రోజువారీ ఆహారంలో వంట నూనె ఎంత పరిమితితో ఉపయోగించవచ్చు.. మితిమీరిన వినియోగంతో ఏమి జరుగుతుంది?-how much cooking oil can be used in daily diet what happens with excessive consumption ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రోజువారీ ఆహారంలో వంట నూనె ఎంత పరిమితితో ఉపయోగించవచ్చు.. మితిమీరిన వినియోగంతో ఏమి జరుగుతుంది?

రోజువారీ ఆహారంలో వంట నూనె ఎంత పరిమితితో ఉపయోగించవచ్చు.. మితిమీరిన వినియోగంతో ఏమి జరుగుతుంది?

Published May 12, 2025 01:27 PM IST Sarath Chandra.B
Published May 12, 2025 01:27 PM IST

రోజువారీ ఆహారంలో పరిమితికి మించి వంట నూనెల వినియోగం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో నెలకు 2 లీటర్లకు మించి వంట నూనె వినియోగించకుండా చూడాలి. క్కువ నూనె వినియోగించడం ద్వారా రోగాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ప్రతి మనిషికి రోజుకు 3-4 టేబుల్ స్పూన్లకు మించి వాడకూడదు.

వంటల్లో నూనెల అతి వినియోగం అనారోగ్యానికి దారి తీస్తుంది.

(1 / 11)

వంటల్లో నూనెల అతి వినియోగం అనారోగ్యానికి దారి తీస్తుంది.

వంటల్లో రోజువారీ వినియోగం ఎంత ఉండాలి..! వంటల్లో నూనె ఎక్కువైతే ఏమవుతుంది…

(2 / 11)

వంటల్లో రోజువారీ వినియోగం ఎంత ఉండాలి..! వంటల్లో నూనె ఎక్కువైతే ఏమవుతుంది…

అతిగా నూనెలు వినియోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు.వంటల్లో రోజువారీ వినియోగానికి పరిమితులు ఉన్నాయి. వంటల్లో ఎంత నూనె వాడాలి, ఎలా వినియోగించాలో తెలుసుకోండి...

(3 / 11)

సాధారణంగా వంట నూనెల్ని మిశ్రమాలుగా వినియోగించడం ఉత్తమం, కోల్డ్‌ ప్రెస్‌లో తయారైన నూనెలకు  నువ్వుల నూనె, వేరుశనగ, రైస్‌ బ్రాన్ ఆయిల్, ఆవనూనెల్ని మిశ్రమంగా కలుపుకోవచ్చు. ఒక్కో మనిషికి నెలకు అర లీటరుకు మించి వంట నూనె వినియోగించకూడదు.  రోజువారీ ఆహారంలో  మూడు నుంచి ఐదు స్పూన్లకు మించి వాడకూడదు.

(4 / 11)

వంటల్లో నూనెలు అతిగా వినియోగిస్తే రక్త నాళాల్లో పూడికలు ఏర్పడతాయి. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులకు కారణం కావొచ్చు.

(5 / 11)

వంటల్లో నిర్దిష్ట పరిణామం మేరకు మాత్రమే నూనెల్ని వినియోగించాల్సి ఉంటుంది.

(6 / 11)

వంటల్లో నిర్దిష్ట పరిణామం మేరకు మాత్రమే నూనెల్ని వినియోగించాల్సి ఉంటుంది.

నూనె లేకుండా వంట చేయడం సాధ్యం కాదు. చేపలు, కొవ్వుల్లో ఉండే విటమిన్‌ ఏ,డి,ఈ,కే వంటి విటమిన్లను శరీరం సంగ్రహించడానికి నూనె చాలా అవసరం.

(7 / 11)

శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని నూనె ద్వారా శరీరానికి లభిస్తుంది.

(8 / 11)

శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని నూనె ద్వారా శరీరానికి లభిస్తుంది.

నూనె గింజలను ఒత్తిడికి గురి చేసి తయారు చేసే కోల్డ్ ప్రెస్‌ నూనెల్లో ఎలాంటి కృత్రిమ రసాయినాలు కలపరు. వీటిలో సహజ రుచి అలాగేఉంటుంది. వీటిలో ఒమోగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

(9 / 11)

నూనెల తయారీలో గింజల్ని  వేడి చేయడం ద్వారా ఉత్పత్తయ్యేవి రిఫైన్డ్‌ ఆయిల్స్‌గా పరిగణిస్తారు.

(10 / 11)

నూనెల తయారీలో గింజల్ని వేడి చేయడం ద్వారా ఉత్పత్తయ్యేవి రిఫైన్డ్‌ ఆయిల్స్‌గా పరిగణిస్తారు.

నూనెలు పారదర‌్శకంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిలో రసాయినాలు కలుపుతారు. ఇలా తయారు చేయడం వల్ల వీటిలో ఒమేగా  3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ తగ్గిపోతాయి. వంట నూనెల్ని రిఫైల్ చేయడం ద్వారా కొన్ని సార్లు వాటిలో ఉండే ప్రమాదకర రసాయినాలు తొలగిపోతాయి. రిఫైన్‌ చేయడం ద్వారా వేరుశనగలో ఉండే అఫ్లటాక్సిన్ అనే విషపదార్థం తొలించవచ్చు.

(11 / 11)

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు