రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా పనిచేస్తాయి.. శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి?-how india rafale fighter jets work 6 interesting facts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా పనిచేస్తాయి.. శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి?

రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా పనిచేస్తాయి.. శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి?

Published May 10, 2025 03:42 PM IST Basani Shiva Kumar
Published May 10, 2025 03:42 PM IST

రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో ఇవి అత్యంత కీలకంగా మారాయి. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాల పనితీరు, ప్రత్యేకతలపై చర్చ జరుగుతోంది.

రాఫెల్ ఒకేసారి అనేక రకాల పనులు చేయగలదు. గగనతలంలో ఆధిపత్యం, నేలపై దాడులు, నిఘా వంటి పనులను ఏకకాలంలో చేయగలవు. అవి అత్యాధునిక రాడార్, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి పైలట్‌కు చుట్టుపక్కల పరిస్థితులపై స్పష్టమైన అవగాహనను అందిస్తాయి.

(1 / 6)

(unsplash)

డెల్టా-వింగ్ డిజైన్, కానార్డ్‌ల వల్ల ఇది అధిక చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. దీని రాడార్ క్రాస్-సెక్షన్ తక్కువగా ఉంటుంది. శత్రువులకు గుర్తించడం కష్టం ఉంటుంది. ఈ విమానంలోని వివిధ సెన్సార్ల నుండి వచ్చే సమాచారాన్ని ఒకచోట చేర్చి, పైలట్‌కు సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభంగా ఉంటుంది.

(2 / 6)

రాఫెల్ విమానాల్లో రెండు స్నెక్‌మా ఎం88 టర్బోఫాన్ ఇంజన్లు ఉంటాయి. ఇవి అధిక థ్రస్ట్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాన్ని అందిస్తాయి. ఆఫ్టర్‌బర్నర్‌ను ఉపయోగించకుండానే సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి చాలా దూరం నుండి శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకుంటాయి.

(3 / 6)

వీటిల్లో మైకా వంటి క్లోజ్-రేంజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇవి గగనతల పోరాటంలో సమర్థవంతంగా పనిచేస్తాయి అధునాతన రాడార్ శత్రు విమానాలను ముందుగానే గుర్తించి లాక్ చేయగలదు. శత్రువుల దాడుల నుంచి కూడా ఈజీగా తప్పించుకుంటుంది.

(4 / 6)

వీటిల్లోని స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్.. శత్రు రాడార్లను గుర్తిస్తుంది. వాటిని జామ్ చేయడం, తప్పుదోవ పట్టించడంలో సహాయపడుతుంది. మొత్తంమీద రాఫెల్ యుద్ధ విమానాలు వాటి అధునాతన సాంకేతికత, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోగలవు.

(5 / 6)

ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు భారత సైనికులకు దన్నుగా నిలుస్తున్నాయి. గతంలో వీటి కొనుగోలు విషయంలో పెద్ద వివాదం జరిగింది. ఇప్పుడు మాత్రం వీటి కొనుగోలుపై పొగడ్తల వర్షం కురుస్తోంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు