Vontimitta Temple : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం.. చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా?
- Vontimitta Temple : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం.. ఎంతో ప్రత్యేకం. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ ప్రసిద్ధ వార్షిక పండుగను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
- Vontimitta Temple : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం.. ఎంతో ప్రత్యేకం. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ ప్రసిద్ధ వార్షిక పండుగను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
(1 / 6)
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం చారిత్రాత్మకమైనది, ఈ ఆలయంలోని రాములవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయంలో శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక్కడ కల్యాణోత్సవం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి.
(2 / 6)
ఒంటిమిట్టలో కోదండరామస్వామి కల్యాణోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ కల్యాణోత్సవానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పునీతులవుతారు.
(3 / 6)
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయంలోని రాములవారి విగ్రహం చాల ప్రత్యేకమైనది. ఇక్కడ సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం ఉంది. ఒంటిమిట్ట కోదండరామాలయంలోని రాములవారి రథం కూడా చాల ప్రత్యేకమైనది.
(4 / 6)
ఒంటిమిట్టలో శ్రీరామనవమికి ఐదో రోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత.
(5 / 6)
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతిని నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు.
(6 / 6)
ఈ ఆలయానికి క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని కోదండరామస్వామివారి విగ్రహం చాల ప్రత్యేకమైనది. ఈ ఆలయం చాల పురాతనమైనది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. 1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు.
ఇతర గ్యాలరీలు