Telangana Tourism : పురాతన ఆలయాలు, కోటలు, జలాశయాలు.. మెతుకు సీమలో పర్యాటక అద్బుతాలు
- Telangana Tourism : మెదక్ జిల్లా.. తెలంగాణలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ అనేక పురాతన ఆలయాలు, కోటలు, జలాశయాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి. అవకాశం ఉంటే.. ఒకే ట్రిప్పులో అన్ని ప్రదేశాలను చూడవచ్చు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.

(1 / 7)
మెదక్ కేథడ్రల్ చర్చి.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి. బ్రిటిష్ వెస్లీయన్ మెథడిస్టులు దీన్ని నిర్మించారు. ఈ చర్చి బాహ్య, అంతర్గత నిర్మాణం ఆకట్టుకుంటుంది.
(2 / 7)
మెదక్ కోట.. పట్టణంలోని ఒక వారసత్వ నిర్మాణం. ఈ కోట చరిత్ర, పురాతన నిర్మాణ శైలికి ప్రతీక. ఇక్కడి నుండి చుట్టుపక్కల ప్రాంతాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి.
(3 / 7)
ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం.. 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠాలలో ఒకటి. దేవత విగ్రహం, దేవాలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తులను ఆకర్షిస్తాయి.
(4 / 7)
కుచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం.. తెలంగాణలోని వెంకటేశ్వర స్వామి ఆరాధకులకు ప్రసిద్ధి దేవాలయం. ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. దీనికి విశిష్టమైన వాస్తుశిల్పం ఉంది.
(5 / 7)
పోచారం రిజర్వాయర్.. మెదక్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలాశయం ఒక చిన్న జంతు అభయారణ్యం. ఇక్కడ బోటింగ్ చేయవచ్చు, పక్షులను చూడవచ్చు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
(6 / 7)
మంజిరా వన్యప్రాణి అభయారణ్యం.. ఈ అభయారణ్యం వివిధ రకాల వన్యప్రాణులకు నిలయం. ఇక్కడ జింకలు, అడవి పందులు, ఇతర జంతువులను చూడవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇతర గ్యాలరీలు