Top Batter In IPL: యూనివర్స్ బాస్ దే రికార్డు..ఐపీఎల్ లో హైయ్యస్ట్ స్కోరు.. టాప్-5లో ఒక్కరే ఇండియన్.. ఓ లుక్కేయండి
- Top Batter In IPL: ఐపీఎల్ 2025 సీజన్ కు మరో వారం కూడా లేదు. పొట్టి క్రికెట్ మజాను అందించేందుకు 10 టీమ్స్ రెడీ అవుతున్నాయి. రికార్డుల మోత మోగించాలని చూస్తున్నాయి. ఈ లీగ్ హిస్టరీలో వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డు 2013 నుంచి కొనసాగుతోంది. అదేంటో చూసేయండి.

(1 / 5)
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ యూనివర్స్ బాస్ 2013లో ఆర్సీబీ తరపున పుణె వారియర్స్ పై అజేయంగా 175 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు.
(x/RCBTweets)(2 / 5)
ఐపీఎల్ కే మెరుపు ఆరంభాన్నిచ్చాడు బ్రెండన్ మెక్ కలమ్. 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్ తొలి మ్యాచ్ లోనే కేకేఆర్ తరపున అతను రెచ్చిపోయాడు. ఆర్సీబీపై 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు.
(x/CricCrazyJohns)(3 / 5)
2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున డికాక్ రెచ్చిపోయాడు. కేకేఆర్ పై 70 బాల్స్ లో 140 రన్స్ చేశాడు. డికాక్ 10 సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టాడు.
(x/thefield_in)(4 / 5)
బాదుడుకు పర్యాయ పదంగా మారిన డివిలియర్స్ కూడా ఐపీఎల్ లో మెరుపు సెంచరీ బాదాడు. ఈ ఆర్సీబీ ఆటగాడు 2015లో ముంబయి ఇండియన్స్ పై 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి.
(x/InsideSportIND)ఇతర గ్యాలరీలు