(1 / 9)
ఈ ఏడాది విక్కీ కౌశల్ నటించిన చావా, అక్షయ్ కుమార్ నటించిన కేసరి 2, హౌస్ ఫుల్ 5, రైడ్ 2 వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ సినిమాల బడ్జెట్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటో తెలుసుకోండి.
(2 / 9)
ఈ ఏడాది విడుదలైన టాప్ 10 సినిమాల జాబితాలో విక్కీ కౌశల్ అందరి కంటే ముందున్నాడు. రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 34 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.770 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.
(3 / 9)
హౌస్ ఫుల్ 5 - అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ మూవీ హౌస్ ఫుల్ 5 రెండవ స్థానంలో ఉంది. ఈ సినిమా బడ్జెట్ రూ.225 కోట్లు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.290 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఐఎండీబీ వెల్లడించింది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది.
(4 / 9)
ఈ సినిమాల జాబితాలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' మూడో స్థానంలో ఉంది. 'రైడ్' విజయం తర్వాత మరో గొప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాలో రితేష్ దేశ్ ముఖ్ విలన్ గా మారాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా వసూలు చేసింది.
(5 / 9)
సితారే జమీన్ పర్ - ఆమిర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమా కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.198 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది.
(6 / 9)
అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ మూవీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లు వసూలు చేసింది. ఇక మన దేశంలో కలెక్షన్ల విషయానికొస్తే రూ.122 కోట్లు రాబట్టింది
(7 / 9)
కేసరి ఛాప్టర్ 2 - అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన కేసరి 2 ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.143 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది.
(instagram)(8 / 9)
జాట్: సన్నీడియోల్ జాట్ ఏడో స్థానంలో ఉంది. అయితే ఇది యావరేజ్ సినిమా. రూ.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.117 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణదీప్ హుడా విలన్ గా మారాడు.
(9 / 9)
భూల్ చుక్ మాఫ్ - రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి జంటగా నటించిన భూల్ చుక్ మాఫ్ మంచి విజయం సాధించింది. రూ.45 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.89 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు