IRCTC Kumbhgram: కుంభమేళాకు వెళుతున్నారా! ఐఆర్‌సీటీసీ కుంభ్‌గ్రామ్ టెంట్‌సిటీలో బస చేయొచ్చు ఇలా…
- IRCTC Mahakumbh Gram: కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులకు స్వాగతం పలకడానికి ఐఆర్‌సీటీసీ “మహాకుంభ గ్రామ్” సిద్ధం చేసింది. అలహాబాద్ సెక్టార్-25 అరైవల్ రోడ్, నైని వద్ద త్రివేణి సంగమం నుండి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభ గ్రామ్‌లో స్నాన ఘాట్‌లు ఇతర పర్యాటక ఆకర్షణలతో టెంట్ సిటీని సిద్ధం చేశారు.
- IRCTC Mahakumbh Gram: కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులకు స్వాగతం పలకడానికి ఐఆర్‌సీటీసీ “మహాకుంభ గ్రామ్” సిద్ధం చేసింది. అలహాబాద్ సెక్టార్-25 అరైవల్ రోడ్, నైని వద్ద త్రివేణి సంగమం నుండి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభ గ్రామ్‌లో స్నాన ఘాట్‌లు ఇతర పర్యాటక ఆకర్షణలతో టెంట్ సిటీని సిద్ధం చేశారు.
(1 / 8)
ప్రయాగ్‌రాజ్‌లోని ఐఆర్‌సిటిసి టెంట్ సిటీ వద్ద యాత్రికులను స్వాగతించడానికి ఐఆర్‌సిటిసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. భారత రైల్వేలకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ విభాగాలు ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ గ్రామ్‌లో ఐఆర్‌సిటిసి టెంట్ సిటీలో పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది.
(2 / 8)
కుంభ గ్రామ్‌లో ఏర్పాటు చేసిన టెంట్‌సిటీ కుంభమేళాను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక వసతి సౌకర్యంగా ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఇందులో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను కల్పించారు. టెంట్ సిటీ త్రివేణి ఘాట్‌కు సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయాలనుకునే అతిథులకు అదనపు ప్రయోజనంగా ఉంటుందని చెబుతున్నారు.
(3 / 8)
అన్ని బుకింగ్స్‌లో భోజనాలతో సహా సదుపాయాలు కల్పిస్తారు. విల్లా టెంట్ల అతిథులకు అదనంగా ప్రత్యేక కూర్చునే ప్రాంతంతో పాటు టెలివిజన్ సదుపాయాలను కూడా కల్పిస్తారు. టెంట్ సిటీ మొత్తం CCTV నిఘాతో పాటు అతిథులకు పటిష్టమైన భద్రత కల్పిస్తారు. మహా కుంభ గ్రామ్‌లో ప్రథమ చికిత్స సౌకర్యాలు మరియు 24/7 అత్యవసర సహాయం కూడా ఉంటాయి.
(4 / 8)
టెంట్ సిటీలో సూపర్ డీలక్స్ టెంట్లు, విల్లా టెంట్లు, 24/7 బాత్రూమ్‌లు, 24/7 వేడి మరియు చల్లటి నీటి సౌకర్యాలు, రోజంతా అందుబాటులో ఉండే హాస్పిటాలిటీ బృందాలు , రూమ్ బ్లోవర్, బెడ్ లినెన్, తువ్వాళ్లు, టాయిలెట్రీ సదుపాయాలు ఆకర్షణీయమైన ధరల వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సిటీసీ అధికారులు ప్రకటించారు.
(5 / 8)
IRCTC ఇప్పటికే తన కుంభ గ్రామ్ టెంట్ సిటీ కోసం బుకింగ్‌లను తన వెబ్‌సైట్ https://www.irctctourism.com/mahakumbhgram లో ప్రారంభించింది. IRCTC జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28వరకు జరిగే కుంభమేళాలో టెంట్ సిటీ సదుపాయాలను ఉపయోగించుకోడానిిక టికెటింగ్ వెబ్‌సైట్ www.irctc.co.inలోని బ్యానర్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
(6 / 8)
మహాకుంభ గ్రామ్ బుకింగ్‌ల కోసం త్వరలో IRCTC బుకింగ్ భాగస్వాములు MakeMyTrip మరియు Golbibo వెబ్‌సైట్‌లలో కూడా ప్రారంభమవుతాయని ఐఆర్‌సిటీసీ ప్రకటించింది. ప్రశ్నలు మరియు బుకింగ్‌ల కోసం, దయచేసి IRCTC కస్టమర్ సహాయక బృందాన్ని 8076025236లో సంప్రదించండి. లేదా mahakumbh@irctc.comకు ఇమెయిల్ సంప్రదించాల్సి ఉంటుంది.
(7 / 8)
మహా కుంభ్ టెంట్ సిటీలో సూపర్ డీలక్స్ గదుల్లో ఇద్దరు బస చేయడానికి రోజుకు రూ.16,200 వసూలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చెక్ ఇన్, ఉదయం పదిగంటల్లోపు చెక్ ఔట్ చేయాల్సి ఉంటుంది. భోజన సదుపాయం కూడా కోరితే ఒక రోజుకు రూ.16,200 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అటాచ్డ్ వాష్ రూమ్స్, సిట్టింగ్ ఏరియా, మాస్టర్ బెడ్ రూమ్, సెక్యూరిటీ సదుపాయం, సీసీటీవీ, మూడు పూటల భోజనం కల్పిస్తారు. ఆరేళ్లలోపు పిల్లలకు ఉచితంగా అనుమతిస్తారు.
ఇతర గ్యాలరీలు