Team India New Jersey: రంగులు మారిన టీమిండియా.. ఏడు సార్లు.. ఏడు రకాలు..!-here the team india jerseys changes for last 7 t20 world cups ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Team India Jerseys Changes For Last 7 T20 World Cups

Team India New Jersey: రంగులు మారిన టీమిండియా.. ఏడు సార్లు.. ఏడు రకాలు..!

Sep 20, 2022, 07:39 AM IST Maragani Govardhan
Sep 20, 2022, 07:39 AM , IST

  • Team India new jersey: వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమరానికి నెల రోజులు కూడా లేని తరుణంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేశారు. గత ఏడు టీ20 ప్రపంచకప్‌ల్లో భారత ఆటగాళ్లు ధరించిన విభిన్నమైన జెర్సీలపై ఇప్పుడు చూద్దాం.

2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లేత నీలం రంగులో ఉన్న జెర్సీని ధరించింది. ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఇదే జెర్సీని ధరించింది. ఈ జెర్సీ భారత క్రికెట్ జట్టు ట్రేడ్ మార్క్‌గా మిగిలిపోయింది.

(1 / 9)

2009 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఈ జెర్సీలో కనిపించింది. కాస్త ముదురు నీలం రంగులో మారింది. కాలర్ లేత బ్లూ కలర్‌కు బదులుగా ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. ఈ టోర్నీలో శ్రీలంకను ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలిచింది.

(2 / 9)

2010 టీ20 ప్రపంచకప్ జెర్సీలో అంతకు ముందు జెర్సీ కంటే పెద్ద మార్పేమి లేదు. డార్క్ బ్లూ, కాలర్ ఆరెంజ్ కలర్‌లో అలాగే ఉంది. ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఈ ప్రపంచకప్ గెలిచింది.

(3 / 9)

2012 ప్రపంచకప్‌లో భారత జెర్సీ 2011 వన్డే వరల్డ్ కప్ జెర్సీ మాదిరిగా ఉంది. శ్రీలంక వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పెద్దగా రాణించలేకపోయింది. శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ ఈ టైటిల్ గెలిచింది.

(4 / 9)

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరింది. అయితే తుదిపోరులో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఈ వరల్డ్ కప్‌లో భారత జెర్సీలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆటగాళ్ల భుజంపై టీమిండియా జెండా డిజైన్ చేశారు.

(5 / 9)

2016 ప్రపంచకప్‌లో భారత్ జెర్సీ ఎరుపు-నారింజ రంగుల మిశ్రమాన్ని కలిగి ఉంది. ఈ జెర్సీని నైక్ లాంచ్ చేసింది. ఎడమ భుజంపై నారింజ రంగుతో కప్పబడి.. జెర్సీకి ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ను ఓడించి వెస్టిండీస్ రెండో సారి గెలిచింది.

(6 / 9)

గత టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ముదురు నీలం రంగు జెర్సీని ధరించారు. దీనికి లేత నీలం రంగు టచ్ ఇవ్వడంతో పూర్తిగా కొత్త రూపంలో ఉంది. గతేడాది ఈ జెర్సీని ఎంపీఎల్ స్పోర్ట్స్ స్వయంగా విడుదల చేసింది.

(7 / 9)

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం విడుదల చేసిన భారత జెర్సీలో మూడు స్టార్లు ఉన్నాయి. మూడు సార్లు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నందుకు ఈ మార్క్ నిదర్శనంగా ఇందులో పొందుపరిచారు. 1983, 2011 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

(8 / 9)

రంగుల మారిన టీమిండియా జెర్సీ

(9 / 9)

రంగుల మారిన టీమిండియా జెర్సీ(all photo- social media)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు