తెలుగు న్యూస్ / ఫోటో /
CWG 2022 Day 5 Highlights: భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు.. లాన్ బౌల్స్‌లో రికార్డు
- కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. ఐదో రోజైన మంగళవారం నాడు భారత క్రీడాకారులు అదరగొట్టారు. మరో రెండు స్వర్ణాలను చేజిక్కించుకున్నారు. మహిళల ఫోర్స్ లాన్ బాల్స్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 17-10 తేడాతో గెలిచి పసిడిని దక్కించుకుంది. అనంతరం ఇదే రోజు పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు సింగపూర్‌పై 3-1 తేడాతో మరో గోల్డ్‌ను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ సిల్వర్ గెలవగా.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో మలేషియా చేతిలో 1-3 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మొత్తంగా పతకాల జాబితాలో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో ఆరో స్థానంలో ఉంది.

(1 / 6)
కామన్వెల్త్ గేమ్స్ 2022 ఐదో రోజు పోటీల్లో రెండు, స్వర్ణాలు, రెండు వెండి పతకాలు లభించాయి. మొత్తంగా పతకాల జాబితాలో 13 మెడల్స్‌తో ఆరో స్థానంలో నిలవగా.. అగ్రస్థానంలో 101 పతకాలతో ఆస్ట్రేలియా ఉంది.
(HT)(2 / 6)
భారత మహిళల ఫోర్స్ లాన్ బాల్స్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 17-10 తేడాతో గెలిచి పసిడిని దక్కించుకుంది.
ఇతర గ్యాలరీలు