(1 / 7)
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాయితీతో కూడిన స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది.
(2 / 7)
రూ. ఆరు వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే కాకుండా... ఆఫ్ లైన్ విధానంలో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
(3 / 7)
దరఖాస్తుదారులు https://tgobmmsnew.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా ఎదరవుతున్నాయి. వీటిని పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలను కూడా చేపట్టింది.
(4 / 7)
ఆన్ లైన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 18005992525 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు(పని దినాల్లో మాత్రమే) ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
(5 / 7)
కేవలం టోల్ ఫ్రీ నెంబర్ మాత్రమే కాకుండా helpdesk.obms@cgg.gov.in కి కూడా మెయిల్ చేయవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
(6 / 7)
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 14వ తేదీతో పూర్తవుతుంది. ముందుగా ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ లైన్ విధానంలో కూడా స్వీకరిస్తున్నారు. ఇలా పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను పై పత్రాలు జత చేసి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లోని ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వాలి. మున్సిపాలిటిలో అయితే మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
(7 / 7)
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణను కూడా సిద్ధం చేసింది.
ఇతర గ్యాలరీలు