Feeding Cow: గోవులకు ఆహారం తినిపిస్తే మంచిదని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?-here are the benefits of feeding cow as per astrology ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Feeding Cow: గోవులకు ఆహారం తినిపిస్తే మంచిదని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Feeding Cow: గోవులకు ఆహారం తినిపిస్తే మంచిదని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Jan 20, 2025, 04:56 PM IST Ramya Sri Marka
Jan 20, 2025, 04:56 PM , IST

Feeding Cow: హిందూ ఆచార వ్యవహారాల్లో గోవులకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వీటిని పూజించడం, ఆహారం తినిపించడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. గోవులకు ఆహారం తినిపిస్తే మంచిదని ఎందుకంటారు? వేదజ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం.

హిందూ మతంలో గోవులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఆవు పాలను అమృతంగా భావిస్తారు.గోమూత్రం, ఆవు పేడకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆవులకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, వీటికి ఆహారం పెట్టడం వల్ల కలిగే ప్రయెజనాలేంటో తెలుసుకుందాం.  

(1 / 6)

హిందూ విశ్వాసాల ప్రకారం గోవుల్లో సకల దేవుళ్లు కొలువై ఉంటారు. వీటిని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. గోవును క్రమం తప్పకుండా పూజించే వారికి జీవితంలో సుఖసంతోషాలు లోపించవని విశ్వాసం. గోవులకు ఆహారం పెట్టడం ద్వారా వ్యక్తి జీవితంలో విజయం, ఆనందం, ముక్తి కలుగుతాయని నమ్ముతారు. 

(2 / 6)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోవులు నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహమైన బృహస్పతి(గురు)తో సంబంధం కలిగి ఉంటాయి. వీటికి ఆహారం తినిపించడం వల్ల వ్యక్తులకు సంపద, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి.ముఖ్యంగా గ్రహ దోష సమస్యలు ఉన్నవారు గోవులకు సంబంధించిన పరిహారాలను పాటించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. 

(3 / 6)

ఆవులు ఆరోగ్యానికి, పోషణకు చిహ్నాలని భావిస్తారు. వీటికి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం, జీవశక్తి మెరుగవుతాయి. కుటుంబ సంబంధాలు బలోపేతం అవుతాయని కూడా నమ్ముతారు.

(4 / 6)

హిందూమత విశ్వాసాల ప్రకారం ఆవును ప్రతిరోజూ పూజించడం, వాటికి రొట్టెలు, ధాన్యాలు, ఆకులు వంటివి తినిపించడం వల్ల  వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించి వారి ఇళ్లు సంపదతో వర్దిల్లుతుంది. 

(5 / 6)

పితృ పక్షం సమయంలో గోవులకు ఆహారం ఇవ్వడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారి ఆశీర్వాదాలతో మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని భావిస్తారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు