
(1 / 5)
తరచుగా మనం రాత్రిపూట ఎక్కువ ఆత్రుత, ఆందోళన కలిగి ఉంటాము. ఆందోళనతో పోరాడే వ్యక్తులు రాత్రిపూట నిద్రిపోవడం చాలా కష్టం. అతిగా ఆలోచించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కానీ, మనం రాత్రిపూటనే ఎందుకు ఎక్కువ ఆందోళనను అనుభవిస్తాము? మనస్తత్వవేత్తలు కొన్ని కారణాలను తెలిపారు.
(Unsplash)

(2 / 5)
రాత్రివేళ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ఇది మన ఆలోచనలతో మనం ఒంటరిగా మిగిలిపోయే సమయం. అందువల్ల కొన్ని భయాలు, ఆందోళనలు చాలా సులభంగా వస్తాయి.
(Unsplash)

(3 / 5)
అలసట ప్రతికూల ఆలోచనలకు ఆజ్యం పోస్తుంది. రాత్రిపూట, మనం అలసిపోతే, మనలో ఉన్న చింతలు, భయాల గురించి అతిగా ఆలోచించడం ప్రారంభిస్తాము. అందుకే రాత్రిపూట ఎక్కువ ఆందోళనను అనుభవిస్తాం.
(Unsplash)

(4 / 5)
కార్టిసాల్ స్థాయిలు రాత్రిపూట తక్కువగా ఉంటాయి, ఇది ఆత్రుతతో కూడిన ఆలోచనలను వేగవంతం చేస్తుంది. దీంతో మనకు మరింత భయం, ఆందోళనలను కలిగిస్తాయి.
(Unsplash)

(5 / 5)
ఉదయం మన ఆలోచనలు మన నియంత్రణలోనే ఉంటాయి, పరిష్కారం లభిస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది, మనం కొద్దిగా రిలాక్స్ గా భావిస్తాము. కానీ రాత్రిపూట దీనికి విరుద్ధంగా ఉంటుంది. మనపై మనకు నియంత్రణ లేదని మనం భావించవచ్చు. ఇది మనల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు