share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు-here are some memorable quotes by charlie munger on investing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Share Market Tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Nov 29, 2023, 07:28 PM IST HT Telugu Desk
Nov 29, 2023, 07:28 PM , IST

Charlie munger: పెట్టుబడుల నిపుణుడు, బెర్క్‌షైర్ హాత్వే వైస్ చైర్మన్ చార్లీ ముంగర్ బుధవారం  కన్నుమూశారు. ముంగర్ ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌కు స్నేహితుడు, సలహాదారు. పెట్టుబడి ప్రపంచంలో వారెన్ బఫెట్ వలె ముంగర్ మాటకు కూడా గౌరవం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆయన పలు సందర్భాల్లో చేసిన సూచనలు..

స్టాక్ మార్కెట్‌లో, షేర్ల కొనుగోలు లేదా అమ్మకం ద్వారా ఆదాయం ఎప్పుడూ రాదు, నిరంతరం షేర్లను కొనడం, విక్రయించడం వల్ల భారీ లాభాలు రావు. వాస్తవానికి, మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ, గరిష్ట కాలానికి సరైన, నాణ్యమైన పెట్టుబడిని చేయడం ద్వారా, అలాగే, మార్కెట్‌కు దాని సమయాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే స్టాక్ మార్కెట్లో సంపదను పెంచుకోవచ్చు.

(1 / 8)

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. 

(2 / 8)

స్టాక్ మార్కెట్ కు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా పరిశీలిస్తుండాలి. భవిష్యత్ ను అంచనా వేయగలిగే నాలెడ్జ్ ను పెంపొందించుకోవాలి.

(3 / 8)

స్టాక్ మార్కెట్ కు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా పరిశీలిస్తుండాలి. భవిష్యత్ ను అంచనా వేయగలిగే నాలెడ్జ్ ను పెంపొందించుకోవాలి.(AFP)

పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎక్కువ లాభం పొందడం ఉత్తమ పెట్టుబడి విధానం. దీన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు స్టాక్ మార్కెట్‌లో కాకుండా వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారని తెలుసుకోవాలి. ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలు, అందులోని మెళకువలు తెలిసి ఉండాలి.

(4 / 8)

సంపాదన కన్నా ఖర్చు తక్కువ ఉండాలి. ఆ మిగిలిన మొత్తాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అలాగే, మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులు, కార్యకలాపాలకు దూరంగా ఉండడం, జీవితాంతం నేర్చుకునే వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా మాత్రమే విజయం సాధించగలం.లేదంటే అదృష్టం మీద మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది.

(5 / 8)

మూర్ఖుడు కూడా నడపగలిగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే, ఒక చిన్న ఆటంకం లేదా నిర్వహణ లోపం కారణంగా కుప్పకూలిన వ్యాపారం మంచి వ్యాపారం కాదు. అంటే, చార్లీ ముంగెర్ అభిప్రాయం ప్రకారం.. కష్ట సమయాల్లో కూడా నిలదొక్కుకునే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది.

(6 / 8)

యవ్వనంలో జీవించే మంచి జీవితమే వృద్ధాప్యంలో భద్రతకు ఉత్తమమైన కవచం. ఆదాయం వస్తున్న సమయంలోనే భవిష్యత్తులో ఆదాయం రాని సమయాన్ని ఎలా గడపాలన్న ప్రణాళిక ఉండాలి. 

(7 / 8)

ఏదైనా వ్యాపారానికి భవిష్యత్తులో మంచి అవకాశం ఉందని మీరు నిజంగా విశ్వసిస్తే, అందులో పెట్టుబడి పెట్టండి. బిజినెస్ స్కూల్‌లో చాలా మందికి బోధించని విషయం ఇది. ఇది పిచ్చితనమే, కానీ మీరు ఉత్తమంగా భావించే వ్యాపారంపై పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమే అవుతుంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు