తెలుగు న్యూస్ / ఫోటో /
Self-Confidence: మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవి.. వెంటనే మార్చుకోండి
- Habits That Lower Self-Confidence: కొన్ని అలవాట్లు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆ అలవాట్లను ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.. ఆ అలవాట్లు ఇవే..
- Habits That Lower Self-Confidence: కొన్ని అలవాట్లు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆ అలవాట్లను ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.. ఆ అలవాట్లు ఇవే..
(1 / 6)
జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలి. ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. అయితే, కొన్ని లక్షణాలు, మరికొన్ని అలవాట్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. వాటిని గుర్తించి, తొలగించుకోవడం అవసరం.(Unsplash)
(2 / 6)
మనపై ప్రతికూల దృక్పథం కలిగి ఉన్న వ్యక్తులు నిరంతరం మన చుట్టూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉన్నప్పుడు, మనకు తగినంత సామర్థ్యం లేదని మనం భావించడం ప్రారంభిస్తాం.(Unsplash)
(3 / 6)
ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు,వాటిని సాధించడం కష్టమవుతుంది. దాంతో, మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అందువల్ల ఆచరణ సాధ్యమైన లక్ష్యాలనే పెట్టుకోవాలి.(Unsplash)
(4 / 6)
ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం, సొంత లక్ష్యం ఉంటాయి. మనల్ని మనం నిరంతరం మరొక వ్యక్తి జయాపజయాలతో పోల్చుకున్నప్పుడు, ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది.(Unsplash)
(5 / 6)
మిమ్మల్ని మీరు నిరంతరం తక్కువ చేసుకుంటూ ఉండవద్దు. స్వీయ విమర్శ కొంత స్థాయి వరకు మంచిదే కానీ, అది హద్దు దాటితే, మీ సక్సెస్ కు అది అడ్డుపడుతుంది. చివరకు మీ కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు