TG Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ దరఖాస్తు విధానం - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే
- Telangana Rythu Bharosa Scheme Updates : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించింది. మార్చి 31లోపు అర్హత గల రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది.
- Telangana Rythu Bharosa Scheme Updates : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించింది. మార్చి 31లోపు అర్హత గల రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది.
(1 / 8)
పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను ప్రారంభించింది. ఈనెల 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఓ గ్రామంలోని రైతుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేసింది.
(2 / 8)
ఇక రాష్ట్రవ్యాప్తంగానూ రైతు భరోసా స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఇప్పటికే సాగు యోగ్యత ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించింది. అన్ని అర్హతలు ఉన్న అన్నదాతలకు మాత్రమే ఈ స్కీమ్ ను వర్తింపజేస్తామని కూడా స్పష్టం చేసింది.
(image source .istockphoto.com)(3 / 8)
రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందించనుంది. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తుంది. లాంఛనంగా స్కీమ్ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది.
(image source .istockphoto.com)(4 / 8)
గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మూడు పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
(image source .istockphoto.com)(5 / 8)
కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
(image source .istockphoto.com)(6 / 8)
కొత్త దరఖాస్తుదారులు ఎవరైనా ఉంటే రైతు భరోసా అకౌంట్ వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల విషయంపై రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలానికి చెందిన వ్యవసాయ అధికారులతో HT తెలుగు మాట్లాడింది. త్వరగా దరఖాస్తు చేసుకుంటే వివరాలు అప్డేట్ అవుతాయని, పెట్టుబడి సాయం అందే విషయంలో ఇబ్బందులు రావని చెప్పారు. గతంలో రైతుబంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
(image source .istockphoto.com)(7 / 8)
భూభారతి(ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుంది. డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
(image source .istockphoto.com)(8 / 8)
రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనవర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
(image source .istockphoto.com)ఇతర గ్యాలరీలు