'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - రైతుల కోసం ప్రత్యేక 'ఫోన్ నెంబర్' వచ్చేసింది..! వివరాలివిగో-helpline number for ap annadata sukhibhava scheme has been made available details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - రైతుల కోసం ప్రత్యేక 'ఫోన్ నెంబర్' వచ్చేసింది..! వివరాలివిగో

'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - రైతుల కోసం ప్రత్యేక 'ఫోన్ నెంబర్' వచ్చేసింది..! వివరాలివిగో

Published Jul 04, 2025 10:19 AM IST Maheshwaram Mahendra Chary
Published Jul 04, 2025 10:19 AM IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. అర్హత సాధించని రైతులు అర్జీలను పెట్టుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ హెల్ప్ లైన్ నెంబర్ (155251)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే అర్హులైన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్హత లేని రైతుల విషయంలోనూ… అధికారులు క్లారిటీ ఇచ్చారు.

(1 / 8)

అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవచ్చని అధికారులు తాజాగా వెల్లడించారు. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు…. గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తగిన వివరాలతో ఫిర్యాదులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

(2 / 8)

గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు ఇస్తే…. అక్కడ సిబ్బంది పరిశీలించనున్నారు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్‌లో ఎంట్రీ చేస్తారని అధికారులు వివరించారు.

(3 / 8)

అన్నదాత సుఖీభవ స్కీమ్ కు అర్హత సాధించని రైతుల కోసం ఏపీ సర్కార్… ప్రత్యేకంగా 155251 నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి తగిన వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు ఓ ప్రకటన ద్వారా వివరించారు.

(4 / 8)

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

(5 / 8)

ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. అయితే అనర్హులుగా ఉన్న వారి దరఖాస్తులను పరిశీలించి… మరికొందరికి కూడా వర్తింపజేసే అవకాశం ఉంది.  ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి…. అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని అధికారులు ఇటీవలే ప్రకటించారు.

(6 / 8)

అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి. హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి. రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 'Search' ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్ 'Approved' అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులవుతారు.

(7 / 8)

సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు…. లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తాజాగా సూచించారు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు