Heeramandi Web series: హీరామండి సక్సెస్ పార్టీ.. తారల తళుకులు: ఫొటోలు
- Heeramandi: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మంచి సక్సెస్ అయింది. ఈ తరుణంలో ఆ సిరీస్ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Heeramandi: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మంచి సక్సెస్ అయింది. ఈ తరుణంలో ఆ సిరీస్ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 10)
'హీరామండి; ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్ సక్సెస్‍ను టీమ్ గ్రాండ్‍గా సెలెబ్రేట్ చేసుకుంది. ముంబైలో శనివారం ఈ ఈవెంట్ జరిగింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, షార్మీన్ సేగల్, సంజీదా షేక్ ఈ పార్టీలో పాల్గొన్నారు.
(2 / 10)
ఈ సిరీస్‍లో నటించిన ఫర్దీన్ ఖాన్, తాహా షా బాదూషా, అధ్యాయన్ సుమన్, శేఖర్ సుమన్ కూడా ఈ సెలెబ్రేషన్లకు హాజరయ్యారు.
(3 / 10)
సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ పార్టీకి ఎల్లో ఔట్‍ఫిట్ ధరించి వచ్చారు. హీరామండి సిరీస్‍లో మల్లికాజాన్ అనే ప్రధాన పాత్ర చేశారు మనీషా.
(4 / 10)
సోనాక్షి సిన్హా ఆకర్షణీయమైన బ్లాక్ డ్రెస్ ధరించి ఈ ఈవెంట్‍కు వచ్చారు. హీరామండిలో రెహానా, ఫరీదన్ జహాన్ అనే రెండు పాత్రలను ఆమె చేశారు.
(5 / 10)
రిచా చద్దా రెడ్ కలర్ డ్రెస్‍లో తళుక్కున మెరిశారు. హీరామండి సిరీస్‍లో మల్లికాజాన్ దత్త కూతురు లజ్వంతిగా రిచా నటించారు.
(6 / 10)
హీరోయిన్ అదితి రావ్ హైదరీ కూడా రెడ్ కలర్ ఔట్‍ఫిట్ ధరించి హీరామండి సక్సెస్ పార్టీలో మెరిశారు. ఈ సిరీస్‍లో మల్లికాజాన్ కూతురు బిబోజాన్ పాత్రను ఆదితి పోషించారు.
(7 / 10)
బ్లాక్ అండ్ వైట్ ఔట్‍ఫిట్‍లో నటుడు ఫర్దీన్ ఖాన్ స్టైలిష్‍గా కనిపించారు. హీరామండిలో వాలీ బిన్ జాయేద్ అల్ మహమ్మద్ క్యారెక్టర్‌ను ఆయన చేశారు.
(8 / 10)
ఎల్లో, గోల్డ్ కలర్ కాంబినేషన్‍లో డ్రెస్‍లో సంజీదా షేక్ ఈ ఈవెంట్‍కు వచ్చారు. హీరామండి సిరీస్‍లో వహీదాగా ఆమె నటించారు.
(9 / 10)
బ్లాక్ డిజైనర్ ఔట్‍ఫిట్‍లో తాహా షా బాదుషా ట్రెండీగా కనిపించారు. హీరామండిలో నవాబ్ తాజ్‍దార్ బలూచ్ పాత్రను ఆయన పోషించారు.
(10 / 10)
బ్లూ, గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి షార్మీన్ సేగల్ హీరామండి సక్సెస్ ఈవెంట్‍కు వచ్చారు. ఈ సిరీస్‍లో ఆమె మల్లికాజాన్ చిన్నకూతురు ఆలమ్‍జేబ్‍గా నటించారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.
ఇతర గ్యాలరీలు