హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!-heavy rains likely in hyderabad city for next three days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

Published May 20, 2025 12:36 PM IST Basani Shiva Kumar
Published May 20, 2025 12:36 PM IST

హైదరాబాద్ వాసులకు వాతావరణ విభాగం నుంచి బిగ్ అలర్ట్ వచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఐఎండీ అంచనా వేసింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈనెల 23వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భాగ్యనగర వాసులకు వాతావరణ శాఖ నుంచి బిగ్ అలర్ట్ వచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‎కు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది.

(1 / 6)

(unsplash)

భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమే.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా మే 23 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

(2 / 6)

హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేసింది. వరద నీరు నిల్వ ఉండే ప్రాంతాలను  గుర్తించి.. చర్యల తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

(3 / 6)

మే 20న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో.. వర్షాల కారణంగా ఉష్ణోగ్రత 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుందని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. మే 21 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

(4 / 6)

20వ తేదీ మంగళవారం నాడు.. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే.. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షం కురవొచ్చు.

(5 / 6)

మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లోనూ మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని హన్మకొండ, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. వాతావరణ విభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు