TG Weather Updates : హైదరాబాద్ ను ముంచెత్తిన వాన - తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు..!
- AP Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 24 వరకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
- AP Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 24 వరకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
(1 / 8)
ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు మరియు దానికి అనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఏపీ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉందని ఐఎండీ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి.
(2 / 8)
ఇవాళ(ఆగస్టు 21) ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 8)
శ్రీకాకుళం,విజయనగరం,అనకాపల్లి,పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(4 / 8)
ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబా, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 8)
ఆగస్టు 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
(6 / 8)
ఇక మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
(7 / 8)
భారీ వర్షాల దాటికి నగరంలో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు కిందపడిపోగా… జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తు పనులు చేపట్టింది. మరోవైపు మూసీ నది ఉరకలెత్తుతోంది. హుస్సేన్‌సాగర్ గేట్లు తెరవడంతో ఆ వరద కూడా మూసీకి వస్తోంది.
(8 / 8)
తెలంగామలో ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో చూస్తే ఉరుములు లేదా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు