Hyderabad Rains : తడిసి ముద్దైన 'హైదరాబాద్' - వర్షాల దాటికి జనం అవస్థలు-heavy rains in hyderabad from two days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Rains : తడిసి ముద్దైన 'హైదరాబాద్' - వర్షాల దాటికి జనం అవస్థలు

Hyderabad Rains : తడిసి ముద్దైన 'హైదరాబాద్' - వర్షాల దాటికి జనం అవస్థలు

Published Jul 21, 2023 11:25 AM IST Maheshwaram Mahendra Chary
Published Jul 21, 2023 11:25 AM IST

  • Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో పాటు జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల చెట్లు కూలిపోవటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగించే పనిలో పడింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నగరంలో భారీ వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి, భారీ వర్షాల కారణంగా లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు చేరింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 

(1 / 6)

(twitter)

వర్షాల దాటికి నగరంలో చాలా చోట్ల చెట్లు నెలకొరిగాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం అక్కడికి చేరుకొని వాటిని తొలగించారు.

(2 / 6)

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ దాటింది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా.. ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

(3 / 6)

 ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.  ముంపు ప్రాంతాల బాధితులను గుర్తించి వారిని వెంటనే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపించాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు జలమండలి అధికారులు… సుమారు 16 ఈఆర్టీ బృందాలను  ఏర్పాటు చేసి… సహాయక చర్యలను కొససాగిస్తోంది.

(4 / 6)

భారీ వర్షాల దాటితో వివిధ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే విభాగాల వారీగా నంబర్లను ఏర్పాటు చేశారు.  మురుగు పొంగినా, తాగునీరు కలుషితమైనా - 155313, అత్యవసర వైద్య సహాయానికి - 8897549792, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే - 8712699444, 8712699101 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

(5 / 6)

శుక్రవారం ఉదయం  10:00  గంటలకు  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం: 43.70 అడుగులుగా ఉంది.   9,64,072 క్యూసెక్యుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక:43.00 అడుగుల వద్ద(ప్రస్తుతం అమలులో ఉంది) రెండో ప్రమాద హెచ్చరిక:48.00 అడుగుల వద్ద, మూడో ప్రమాద హెచ్చరిక:53.00 అడుగుల వద్ద జారీ చేస్తారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు