(1 / 5)
“మన విజినరీ నేతలు, ఎఫీషియెంట్- హానెస్ట్ బీఎంపీసీ అధికారుల పనితీరుతో బెంగళూరు వెనిస్‌గా మారింది. మీరు బయటకు వెళ్లాలనుకుంటే, పడవల్లో ప్రయాణానికి ప్లాన్ చేసుకోండి,” అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. తన ప్రాంతంలో నీట మునిగిన వీధులకు చెందిన వీడియోని అటాచ్ చేశాడు.
(2 / 5)
భారీ వర్షాలకు పలు ఐటీ పార్కులు, కార్పొరేట్ హబ్ లకు నిలయమైన ఉత్తర, తూర్పు బెంగళూరులోని ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. సహాయక చర్యల కోసం అధికారులు ఇలా ఏర్పాట్లు చేశారు.
(3 / 5)
కోరమంగళ వంటి ఎత్తైన ప్రాంతాలతో పాటు అనేక చోట్ల భారీ వర్షాలకు వీధుల్లోకి వర్షపునీరు చేరింది. ప్రజలు వాటిని భరించలేక ఇబ్బంది పడుతున్నారు.
(ANI - X)(4 / 5)
మాన్యతా టెక్ పార్క్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు చూపించే అనేక వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఒక రెడ్డిట్ యూజర్ నీట మునిగిన సైట్ వీడియోపై సరదాగా కామెంట్ చేశాడు, “హేయ్ గాయ్స్, నేను ఉబెర్‌లో బోట్ రైడ్స్ అందిస్తున్నాను. ఆసక్తి ఉంటే బుక్ చేసుకోండి,” అని రాసుకొచ్చాడు.
(PTI)(5 / 5)
దశాబ్దానికి పైగా వరద సమస్యలతో సతమతమవుతున్న కేఆర్ పురంలోని సాయి లేఅవుట్ వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు సాధారణంగా రూ .80 లక్షల నుండి ప్రారంభమై రూ .2-3 కోట్ల వరకు ఉంటాయి. ఇంత ఖర్చు చేసినా పరిస్థితి ఇలా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు