TG Weather Updates : తెలంగాణలో మరింత విస్తరించిన రుతుపవనాలు - హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!-heavy rains are likely to occur in many districts along with hyderabad imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg Weather Updates : తెలంగాణలో మరింత విస్తరించిన రుతుపవనాలు - హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

TG Weather Updates : తెలంగాణలో మరింత విస్తరించిన రుతుపవనాలు - హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

Jun 07, 2024, 02:28 PM IST Maheshwaram Mahendra Chary
Jun 07, 2024, 02:28 PM , IST

  • Rains in Telugu States : ఏపీ, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. రుతపవనాల రాకతో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో… భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. రుతపవనాల రాకతో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో… భారీ వర్షాలు పడుతున్నాయి.

(1 / 6)

ఏపీ, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. రుతపవనాల రాకతో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో… భారీ వర్షాలు పడుతున్నాయి.(photo source @APSDMA Twitter)

 హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం(జూన్ 7వ తేదీ) పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

(2 / 6)

 హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం(జూన్ 7వ తేదీ) పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.(photo source @APSDMA Twitter)

. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.. మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. ఇవాళ. సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 6)

. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.. మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. ఇవాళ. సాయంత్రం హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.(photo source @APSDMA Twitter)

ఇవాళ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

(4 / 6)

ఇవాళ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.(photo source @APSDMA Twitter)

ఇక ఏపీలో చూస్తే కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరమ కేంద్రం హెచ్చరించింది.

(5 / 6)

ఇక ఏపీలో చూస్తే కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరమ కేంద్రం హెచ్చరించింది.(photo source unshplash.com)

నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. 

(6 / 6)

నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. (photo source @APSDMA Twitter)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు