తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు - హైదరాబాద్‌లో భారీ వర్షం, ఆ తేదీ వరకు తెలంగాణలో వానలే..!
- Heavy Rain in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మరోవైపు గురువారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Heavy Rain in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మరోవైపు గురువారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి(@APSDMA Twitter)
(2 / 7)
బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, బోరబండ, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, ముషీరాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.(@APSDMA Twitter)
(3 / 7)
మరో నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.(Twitter)
(4 / 7)
జూన్ 6 - 10వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. జూన్ 12వ తేదీ వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.(@APSDMA Twitter)
(5 / 7)
నైరుతి రుతుపవనాలు తెలంగాణ తో పాటు ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు.(@APSDMA Twitter)
(6 / 7)
రేపు(జూన్ 7) ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.(Twitter)
ఇతర గ్యాలరీలు