
(1 / 9)
విజయవాడలో శనివారం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరవాసులు ఉలికిపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు.
(2 / 9)
పలు కాలనీలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. సెల్లర్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చాలాచోట్ల కార్లు, ఇతర వాహనాలు మునిగిన పరిస్థితి కనిపించింది.

(3 / 9)
మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

(4 / 9)
ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద పరిస్థితి

(5 / 9)
విజయనాడ నగరంలోని ఓ రహదారిపైకి చేరిన వరద నీరు
(6 / 9)
నీట మునిగిన కాలనీల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. పలువురు ప్రజా ప్రతినిధులు కూడా లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

(7 / 9)
లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రదేశాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

(8 / 9)
నగరంలో చాలా కాలనీలు నీటితో దర్శనమిస్తున్నాయి. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన చేశారు.
(9 / 9)
కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,02,194 క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఇతర గ్యాలరీలు