తెలుగు న్యూస్ / ఫోటో /
Heavy rain batters Mumbai: వర్షాలకు వణుకుతున్న ముంబై; చెరువులుగా రహదారులు; జనావాసాల్లోకి వరద నీరు
Heavy rain batters Mumbai: భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోతోంది. దశాబ్దం క్రితం వరద నీటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటోంది. దాదాపు గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో జన జీవనం స్తంభించిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
(1 / 5)
రాయిగఢ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
(Sourced)(2 / 5)
ముంబైలోని అంధేరీలో నీటమునిగిన సబ్ వే. ముంబైలో శుక్రవారం కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
(Vijay Bate/ Hindustan Times)(3 / 5)
ముంబైలో బుధవారంతో పోలిస్తే, గురువారం కొంత తక్కువగానే వర్షపాతం నమోదైంది. బుధవారం సుమారు 100 ఎంఎం వర్షపాతం నమోదు కాగా, గురువారం 30 ఎంఎం వర్షపాతం నమోదైంది.
(Vijay Bate/ Hindustan Times)(4 / 5)
భారీ వర్షాలతో ముంబై లో రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప, బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
(Bloomberg)ఇతర గ్యాలరీలు