Vijayawada City Rains : రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద - ప్రయాణికులను కాపాడిన SDRF టీమ్
- Rayanapadu Station Vijayawada : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
- Rayanapadu Station Vijayawada : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
(1 / 5)
విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
(2 / 5)
రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఆరవ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ రెస్కూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది.
(3 / 5)
తాడు సాయంతో ప్రయాణికులను వరద నీటి నుంచి బయటికి తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్ మొత్తం నీటితో నిండిపోయింది.
(4 / 5)
విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ సిటీని ముంచెత్తింది. 2005 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.
(5 / 5)
ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.
ఇతర గ్యాలరీలు