Heatwaves: వేడిగాలుల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
- Heatwaves: ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వేడి సంబంధిత రోగాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- Heatwaves: ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వేడి సంబంధిత రోగాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
(1 / 8)
ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన వేడివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. కొన్ని చిట్కలు పాటించడం ద్వారా శరీరం వేడెక్కకుండా కాపాడుకోవచ్చు.
(REUTERS)(2 / 8)
వేసిలో డీహైడ్రేషన్ సమస్య త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి గంటకు నీటిని తాగుతూ ఉండాలి. కొబ్బరినీరు, పండ్ల రసాలు, పుచ్చకాయ వంటివి తినడం వల్ల శరీరంలో నీరు తగ్గకుండా ఉంటుంది.
(pexels)(3 / 8)
ఎండాకాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుంటే మంచిది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే లేత రంగులలో ఉండే దుస్తులను ధరించండి. వేడిని అధికంగా గ్రహించే ముదురు రంగులకు దూరంగా ఉండండి.
(HT Photo/Sanjeev Verma)(4 / 8)
వేడి సంబంధిత అనారోగ్యాలను రాకుండా ఉండాలంటే శరీరం వేడెక్కకుండా చూసుకోండి. తీవ్రమైన వ్యాాయామాలు, శారీరక శ్రమ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రోజులో చల్లని సమయాల్లో వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి.
(Shutterstock)(5 / 8)
ఇంట్లో కూలింగ్ పరికరాలను ఉపయోగించండి. మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. శరీరం వేడెక్కితే జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.
(pexels)(6 / 8)
ఎండల్లో బయటికి వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించండి. ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
(HT Photo/Keshav Singh)(7 / 8)
మండే ఎండల్లో సులువుగా జీర్ణమయ్యే తేలికపాటి, తాజా ఆహారాన్ని తినండి. హైడ్రేటెడ్ గా ఉండటానికి మీ ఆహారంలో నీరు అధికంగా ఉండేలా చూసుకోవాలి. మెనూలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
(unsplash)ఇతర గ్యాలరీలు