(1 / 6)
మన శరీరానికి శక్తిని, మనసుకు హాయిని ఇచ్చే పానీయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల జ్యూస్ లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. వాటి వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎలాంటి జ్యూసులు తాగాలో తెలుసుకోండి.
(freepik)(2 / 6)
అరటి కాండం: లేత అరటి కాండాన్ని పొడవుగా కోసి నీటిలో వేసి గ్రైండ్ చేయాలి. దీనిలో యాలకులు, కర్పూరం వేసి రుచికరంగా మార్చుకోవాలి. ఈ రసం శరీరంలోని వ్యర్థాలను, మురికిని తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
(freepik)(3 / 6)
ముల్లంగి: ముల్లంగి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీన్ని చిన్న ముక్కలుగా తరిగి నీటిలో కలిపి జ్యూస్ లా ఉపయోగించాలి. ఈ జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇది అనేక సూక్ష్మ ఖనిజాలతో నిండి అవుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఈ జ్యూస్ తాగితే మంచిది.
(freepik)(4 / 6)
పొట్లకాయ: పొట్లకాయను చిన్న ముక్కలుగా చేసుకుని జ్యూస్ గా మార్చుకోవాలి.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్లైకోకోలేట్స్ అనే ఖనిజం దీనిలో ఉంటుంది. దీన్ని తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితీరును నియంత్రిస్తుంది. మహిళలు రుతుస్రావానికి ముందు దీన్ని తాగితే అధిక రక్తస్రావం కాకుండా ఉంటుంది.
(freepik)(5 / 6)
దుర్వా: గుప్పెడు దుర్వా గడ్డిని తీసుకుని పొడి చేసి దాచుకోవాలి. ప్రతిరోజూ ఆ పొడిని గ్లాసుడు నీళ్లలో వేసి తాగుతూ ఉండాలి. దీని రుచి ఎవరికీ నచ్చదు. కానీ ఆరోగ్యం కోసం దీన్ని తాగాల్సిందే. దీన్ని తాగడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
(freepik)(6 / 6)
బీట్ రూట్ జ్యూస్: అల్సర్ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ ను తరచూ తాగుతూ ఉండాలి. ముఖ్యంగా దానిలో తేనె కలిపి తాగితే అల్సర్ త్వరగా నయమవుతుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది.
(freepik)ఇతర గ్యాలరీలు