Radish Disadvantages: ముల్లంగి అందరి ఆరోగ్యానికి మేలే చేస్తుందా? ఎలాంటి వారు దీనికి దూరంగా ఉండాలో తెలుసా?
Radish Disadvantages: ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ అందరూ దీన్ని తినకూడదని మీకు తెలుసా. కొన్ని లక్షణాలు ఉన్నవారు ముల్లంగి తినడం వల్ల మేలు కన్నా ఎక్కువ కీడు జరుగుతుంది. వీళ్లు ముల్లంగిని తింటే ఆరోగ్యం మరింత దిగజారవచ్చు జాగ్రత్త.
(1 / 8)
ముల్లంగి చలికాలంలో బాగా లభించే కూరగాయ. ఆరోగ్యానికి చాలా మేలు చేసి ముల్లంగిని, దాని ఆకులను వివిధ రకాలుగా వాడతారు.
(Canva)(2 / 8)
ముఖ్యంగా చలికాలంలో ముల్లంగి ఆకు కూర, ముల్లంగి పరాట, ముల్లంగి సలాడ్‌లను ఇష్టంగా తింటారు. ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి.
(Freepik)(3 / 8)
ఇవన్నీ ఆరోగ్య సమస్యలను తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కానీ ముల్లంగి అందరికీ మంచిది కాదు. కొంతమందికి ఇది హానికరం. ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నవారు ముల్లంగిని తినడం వల్ల సమస్యలు తీవ్రమవుతాయి. ముల్లంగి తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం
(4 / 8)
రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు: ముల్లంగి తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను హెచ్చుతగ్గులకు గురి చేస్తుంది. ముల్లంగి తినడం వల్ల హైపోగ్లైసీమియా వస్తుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు ముల్లంగి తినకపోవడమే మంచిది.
(5 / 8)
వాంతులు, విరేచనాలు: ముల్లంగిలో ఇనుము అధికంగా ఉంటుంది. ముల్లంగిని ఎక్కువగా తింటే శరీరంలో ఇనుము శాతం పెరుగుతుంది. దీనివల్ల విరేచనాలు, కడుపు నొప్పి, తలతిరగడం లేదా వాంతులు వంటి సమస్యలు వస్తా
(6 / 8)
థైరాయిడ్ సమస్య ఉన్నవారు: థైరాయిడ్ సమస్య ఉన్నవారు ముల్లంగిని ఎక్కువగా తినకూడదు. ఇందులో థియోగ్లూకోసైడ్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇది థైరాయిడ్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
(7 / 8)
శరీరంలో నీటి కొరత: ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇవి మూత్రవిసర్జనను పెంచే గుణాలను కలిగి ఉంటాయి. అంటే మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. ఇది తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది. తగినంత నీరు త్రాగకపోతే శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
ఇతర గ్యాలరీలు