Health Tips: ఈ ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో ఎక్కువసేపు ఉంచితే చాలా డేంజర్..
Health Tips: ఆహార పదార్ధాలను ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరం. నిజానికి ఏ ఆహారమైన తాజాగా ఉన్నప్పుడు తినడమే ఆరోగ్యకరం. కానీ, తప్పని సరి పరిస్థితుల్లో ఫ్రిజ్ లో ఆహారాన్ని నిల్వ చేస్తున్నాం. అయితే, ఈ ఆహారాలను ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదు.
(1 / 6)
చలికాలం అయినా, వేసవి అయినా ఇళ్లలో రిఫ్రిజిరేటర్ వాడకం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆహార పదార్థాలను నిల్వ చేసి ఎక్కువ సేపు తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా సందర్భాల్లో ఎక్కువ ఆహారాన్ని ఇంట్లో తయారు చేసినా లేదా కొన్ని కారణాల వల్ల వదిలేసినా రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసి తిరిగి ఉపయోగిస్తారు..వాస్తవానికి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, రిఫ్రిజిరేటర్లో ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం.
(Shutterstock)(2 / 6)
కొందరికి ఒకేసారి ఎక్కువ పిండిని సిద్ధం చేసుకుని ఫ్రిజ్ లో భద్రపర్చుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదు. నిజానికి ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచిన పిండి ఆరోగ్యానికి చాలా హానికరం. సాధారణంగా పిండిని ఉదయం సిద్ధం చేసి సాయంత్రం వరకు ఫ్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు. కానీ, అయితే పాత పిండిని 2-3 రోజుల పాటు వాడకూడదు. హానికరమైన బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. కడుపులో మలబద్దకం, అసిడిటీ మొదలైనవి వస్తాయి.
(Pixabay)(3 / 6)
అన్నాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదు. నిజానికి అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు అంటారు. ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచిన అన్నంలో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది.ఇది పొట్టకు హాని కలిగిస్తుంది. అన్నాన్ని గరిష్టంగా ఒక రోజు ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ సేపు నిల్వ చేసి తింటే అజీర్ణం వస్తుంది.
(Pixabay)(4 / 6)
వండిన పప్పును రెండు రోజులకు మించి రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయకూడదు. ఎక్కువ కాలం ఫ్రిజ్ లో పెడ్తే, అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి..ఉడికించిన పప్పును ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేస్తే అందులోని పోషకాలన్నీ నాశనమవుతాయి. అంతేకాకుండా ఈ పప్పులు తినడం వల్ల అజీర్ణం, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి.
(Pixabay)(5 / 6)
ఏదైనా వండిన కూరగాయలను నాలుగైదు గంటలు మాత్రమే రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాలి. మసాలాతో చేసిన కూరలను కూడా ఎక్కువ కాలం ఫ్రిజ్ లో ఉంచకూడదు. నిజానికి కూరలను ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్ లో ఉంచితే వాటి రుచి చెడిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం.
(Pixabay)(6 / 6)
వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో భద్రపరిచే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట మీ ఫ్రిజ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మురికి ఫ్రిజ్ లో ఉండే బ్యాక్టీరియా వల్ల మీ ఆహారం త్వరగా చెడిపోతుంది. ఆహారంలోకి బ్యాక్టీరియా సోకుతుంది. అలాగే, ఒకేసారి చాలా ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయకుండా ఉండండి.
(Pixabay)ఇతర గ్యాలరీలు