(1 / 6)
Jaggery Milk Benefits: పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ పాలలో ఒక ముక్క బెల్లం కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
(2 / 6)
Jaggery Milk Benefits: బెల్లం జీర్ణ ఎంజైమ్ లను ఉత్తేజపరుస్తుంది. మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. భోజనం తర్వాత పాలలో బెల్లం ముక్కను కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
(3 / 6)
Jaggery Milk Benefits: వేడి పాలలో బెల్లం కలిపి తీసుకుంటే అది శరీరాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. ఇది కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అదనంగా బెల్లంలోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి సాధారణ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
(4 / 6)
Jaggery Milk Benefits: బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పాలలోని కాల్షియం, ప్రోటీన్ తో కలిపి ఇది శక్తివంతమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది
(5 / 6)
Jaggery Milk Benefits: పాలలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. బెల్లం జోడించడం వల్ల ఇది మరింత పెరుగుతుంది. ఎందుకంటే దీనిలోని ఐరన్ ఎముకల సాంద్రతను పెంచుతుంది.
(Pexel)ఇతర గ్యాలరీలు