Immunity Boosting Teas: వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఈ హెర్బల్ టీలు తాగండి!
- Immunity Boosting Teas: వర్షాకాలంలో వ్యాధులు రావడం సాధారణం, రోగనిరోధక శక్తిని పెంచుకుంటే అనారోగ్యాలను తట్టుకోవచ్చు. కొన్ని హెర్బల్ టీలు తాగుతూ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
- Immunity Boosting Teas: వర్షాకాలంలో వ్యాధులు రావడం సాధారణం, రోగనిరోధక శక్తిని పెంచుకుంటే అనారోగ్యాలను తట్టుకోవచ్చు. కొన్ని హెర్బల్ టీలు తాగుతూ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
(1 / 5)
వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు, దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటివి సర్వసాధారణం. అదనంగా చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కొన్ని హెర్బల్ టీలు తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో ఇక్కడ చూడండి.
(2 / 5)
వర్షంలో అల్లం టీ తాగుతుంటే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలసట, మైకము నివారిస్తుంది. అలాగే ఈ టీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది.
(3 / 5)
మందార టీ - రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె, గర్భాశయం, కాలేయానికి మంచిది. మందార పువ్వులను వేడినీటిలో ఉడకబెట్టి, వడకట్టి, తేనె కలుపుకొని తాగాలి.
(4 / 5)
మసాలా టీ - వేడినీటిలో గ్రీన్ టీ పొడిని వేసి, ఏలకులు, బెరడు, లవంగాలు, తురిమిన అల్లం వేసి మరిగించాలి. ఆపై వడకట్టి తేనె లేదా ఖర్జూరం కలుపుకొని త్రాగాలి. ఈ మసాలాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఇతర గ్యాలరీలు