తెలుగు న్యూస్ / ఫోటో /
Halloween 2022 | దెయ్యాల పండగ హాలోవీన్.. వెంటాడే వేడుకలు, భయానకమైన వాస్తవాలు!
- Halloween 2022: నగరాల్లోని కొన్ని రెస్టారెంట్లు, పబ్బుల్లో హాలోవీన్ పార్టీలు జరుగుతాయి. భయంకరంగా కనిపించే గుమ్మడి కాయలు, దెయ్యాల లాగా బట్టలు, మేకప్ వేసుకోవడం ఈరోజు చేస్తారు. మీకు ఈరోజు భయంకరమైన రోజు కావాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఫెస్టివల్ గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.

(1 / 7)
దెయ్యాల పండగ హాలోవీన్ గురించి తెలుసా? ఇది పాశ్చాత్య దేశాలలో ప్రతీ ఏడాది అక్టోబర్ 31న జరుపుకుంటారు. చనిపోయిన వారి పూర్వీకులు ఈరోజు తిరిగి వస్తారనేది అక్కడి వారి నమ్మకం. (Unsplash)
(2 / 7)
హాలోవీన్ పండగతో పాటుగా ట్రిక్-ఆర్-ట్రీటింగ్ అనే అభ్యాసం కూడా చేస్తారు. ఈ సంప్రదాయాన్ని 'ఆత్మ' అని పిలుస్తారు. పేద పిల్లలు డబ్బు, ఆహారం కోసం ఇంటింటికీ వెళ్లి వేడుకుంటారు. బదులుగా వారు ఆ ఇంట్లో మరణించిన వారి ఆత్మల శాంతి కోసం ప్రార్థిస్తారు.(Unsplash)
(3 / 7)
మొట్టమొదటి సారిగా హాలోవీన్ వేడుకను పురాతన యురోపియన్ సెల్టిక్ పండుగ 'సోవ్-ఇన్' లో భాగంగా జరిపారు. ఇది 1840లలో యునైటెడ్ స్టేట్స్‌కు పాకింది. (Unsplash)
(4 / 7)
హాలోవీన్ సంప్రదాయంలో పిల్లులు ఒక భాగంగా ఉన్నాయి. సోవ్-ఇన్ వేడుకలలో భాగంగా ప్రీస్ట్‌లు పిల్లులను, అలాగే ఇతర జంతువులను బలి ఇస్తారు. భవిష్యత్తులో జరిగబోయేది అంచనా వేయడం కూడా ఇందులో ఒక ఘట్టం.(Unsplash)
(5 / 7)
ఆత్మలను దూరం చేయడానికి భయంకరమైన దుస్తులు ధరించడం పూర్వం జరిపేవారు, హలోవిన్ రోజున చనిపోయిన వారి ఆత్మలు భూమిపై ఉన్న వారి ఇళ్లకు తిరిగి వస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంలో దెయ్యాలలాగా తయారవుతారు. మనుషులు, దయ్యాల మధ్య గీత చెరిగిపోయి, అందరూ ఒక్కటయ్యారు అనేది ఈ సంప్రదాయం సూచిస్తుంది. (Unsplash)
(6 / 7)
హాలోవీన్ వేడుకల్లో ముఖ్యంగా నలుపు, నారింజ రంగుల థీమ్ ఉపయోగిస్తారు. నలుపు చనిపోయిన వారికి సూచిక, సుదీర్ఘమైన శీతాకాలంకు చిహ్నం కాగా, ఆరెంజ్ శరదృతువు రాక.. చలిమంటలను సూచిస్తుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు