(1 / 5)
అందాల తార హన్సిక మోత్వానీ ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెరుస్తుంటారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంటారు. తాజాగా మరోసారి చీరలో తళుక్కుమన్నారు ఈ హీరోయిన్.
(2 / 5)
నీలి రంగు చీరలో హన్సిక మరింత అందంగా కనిపించారు. చమ్కీలతో ఉన్న ఈ శారీలో అందాల మెరుపులు మెరిపించారు. హొయలు ఒలికిస్తూ ఈ బ్యూటీ ఆకట్టుకున్నారు.
(3 / 5)
ఈ అట్రాక్టివ్ చీరలో అదిరే పోజులు ఇచ్చారు హన్సిక. చూపు తిప్పుకోనివ్వని అందంతో ఆకర్షించారు. ఈ ఫొటోలను నేడు (మే 13) తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ అమ్మడు. హాయ్ అంటూ బ్లూకలర్ హార్ట్ ఎమోజీ క్యాప్షన్ రాశారు.
(4 / 5)
తన కెరీర్‌ను బాలీవుడ్‍లో చైల్డ్ ఆర్టిస్టుగా మొదలు పెట్టారు హన్సిక. ఐదు చిత్రాల్లో బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత తెలుగు మూవీ దేశముదురు (2007)తో హీరోయిన్ అయ్యారు హన్సిక. అల్లు అర్జున్ సరసన ఆ సినిమాలో నటించిన ఈ బ్యూటీ పాపులర్ అయ్యారు.
(5 / 5)
ఆ తర్వాత సుమారు 18ఏళ్లుగా తెలుగు, హిందీ, తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నారు హన్సిక. ప్రస్తుతం ఈ భామ లైనప్‍లో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి సినిమాల్లో నటిస్తున్నారు ఈ భామ.
ఇతర గ్యాలరీలు