(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గతేడాది మాదిరి కాకుండా… ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే.. జనం జంకుతున్నారు.
(Twitter)(2 / 7)
తెలంగాణతో పోల్చితే ఏపీలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చాలా జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి రావటంతో… పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది.
(image source istock.com)(3 / 7)
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ విద్యాశాఖ ఒంటిపూట బడులపై కసరత్తు చేసే పనిలో పడింది. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించాలని యోచిస్తోంది.
(image source istock.com)(4 / 7)
గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది.
(image source istock.com)(5 / 7)
ఎండల తీవ్ర ఎక్కువగా ఉండటంతో పాటు మార్చిలో మరింత పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీలైతే మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
(6 / 7)
ఒంటిపూట బడులపై ప్రకటన వస్తే…. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుత సమయం కాకుండా… ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలల్లో ప్రత్యేక వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు చేపడుతోంది..
(7 / 7)
ఇక ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21- ఇంగ్లీష్, మార్చి 24 -గణితం, మార్చి 26- ఫిజిక్స్, మార్చి 28 - బయోలజీ, మార్చి 31 - సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది.
ఇతర గ్యాలరీలు