(1 / 7)
యోగ దినోత్సవం సందర్భంగా అరచేతిలో యోగ లోగోను శివ కుమార్ అద్భుతంగా ఆవిష్కరించారు.
(2 / 7)
రావి ఆకుపై అమ్మాయి యోగాసనం వేసినట్లు గీశారు. యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచడమే కాదు. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీంతో క్రమం తప్పకుండా యోగ చేయడం వలన రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
(3 / 7)
యోగ ప్రాణాయామము ఆసనాలు వలన మానసిక, శరీరక విశ్రాంతి, ఉపశమనం లభించి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.
(4 / 7)
ఒకే రావి ఆకుపై తొమ్మిది రకాల సూర్య నమస్కారాలను గీసిన శివ కుమార్.
(5 / 7)
సూర్య నమస్కారాలు చేస్తున్న ఆకును చూపుతున్న లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్. గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు.
(6 / 7)
శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణంలో పోలీస్ సిబ్బంది యోగా ఆసనాలను వేశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంన్ని కాపాడడానికి యోగ తోడ్పడుతుందని సీపీ తెలిపారు .
(7 / 7)
జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఈ రోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని యోగ శిక్షకుడు యాదవ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి లో పోలీస్ సిబ్బందితో యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము చేయించారు..
ఇతర గ్యాలరీలు