(1 / 5)
గుజరాత్ టైటాన్స్ యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2025లో నిలకడగా రాణిస్తున్న ఈ ఓపెనర్ లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు.
(Surjeet Yadav)(2 / 5)
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా సాయి సుదర్శన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఈ యంగ్ ఓపెనర్ 54 ఇన్నింగ్స్ లోనే 2 వేల పరుగులు చేశాడు.
(Surjeet Yadav)(3 / 5)
ఐపీఎల్ 2000 రన్స్ చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ రికార్డును సాయి సుదర్శన్ బ్రేక్ చేశాడు. సచిన్ 59 ఇన్నింగ్స్ ల్లో 2 వేల పరుగులు చేశాడు.
(PTI)(4 / 5)
ఐపీఎల్ లో ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 2000 రన్స్ చేసిన ప్లేయర్ గా షాన్ మార్ష్ కొనసాగుతున్నాడు. అతను 53 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు. సాయి సుదర్శన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
(AFP)(5 / 5)
ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. 10 మ్యాచ్ ల్లో 504 పరుగులు చేశాడు. 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ తో సాగుతున్నాడు. ఈ సీజన్ లో 500 రన్స్ చేసిన ఫస్ట్ బ్యాటర్ అతడే.
(PTI)ఇతర గ్యాలరీలు