(1 / 5)
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో నిలకడగా రాణిస్తున్నాడు. 5 ఇన్నింగ్స్ లో 54.60 సగటుతో 273 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 151గా ఉంది.
(Surjeet )(2 / 5)
ఈ సీజన్ టాప్ స్కోరర్స్ లిస్ట్ లో ప్రస్తుతం సాయి సుదర్శన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ (287) ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో సుదర్శన్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు.
(REUTERS)(3 / 5)
74, 63, 49, 5, 82.. 23 ఏళ్ల లెఫ్టార్మ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ 2025లో అయిదు మ్యాచ్ ల్లో వరుసగా చేసిన పరుగులు. ఒక్క సన్ రైజర్స్ తో పోరులో మాత్రమే అతను 5 రన్స్ చేశాడు. నిలకడతో పరుగుల వేటలో సాగుతున్న సుదర్శన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
(Surjeet )(4 / 5)
ఐపీఎల్ 2024లోనూ సాయి సుదర్శన్ అదరగొట్టాడు. ఆ సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 527 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ కారణంగా గుజరాత్ అతణ్ని రూ.8.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.
(AFP)(5 / 5)
సాయి సుదర్శన్ ఇప్పటికే టీమిండియా తరపున వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. ఆడిన 3 వన్డేల్లో 63.50 సగటుతో సుదర్శన్ 127 రన్స్ కొట్టాడు. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ ఆ తర్వాత గాయంతో టీమ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో నిలకడగా సత్తాచాటి మళ్లీ టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నాడు.
(AFP)ఇతర గ్యాలరీలు