తెలుగు న్యూస్ / ఫోటో /
lemon plant: నిమ్మకాయలు గుత్తుగుత్తులుగా కాయాలంటే నిమ్మ మొక్కను ఇలా పెంచండి
Gardening tips: కొన్నిసార్లు నిమ్మచెట్లు సరిగా కాయవు. ఇక్కడ మేము ఇచ్చిన చిట్కాలతో నిమ్మ మొక్కను పెంచితే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి.
(1 / 6)
ఇంట్లో నిమ్మచెట్లను పెంచడం చాలా సులువు. పెద్ద కుండీల్లో కూడా నిమ్మ మొక్కను పెంచుకోవచ్చు. నిమ్మకాయలు ఎక్కువగా కాయాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటించాలి.
(3 / 6)
నేలలో నిమ్మ చెట్లను నాటితే వాటి చుట్టూ కొంత స్థలాన్ని వదిలేయండి. ఎందుకంటే వేర్లు బాగా వ్యాపిస్తాయని చెబుతారు. వేర్లు బాగా వ్యాపిస్తే చెట్టు బాగా పెరుగుతుంది.
(4 / 6)
సేంద్రియ ఎరువులను ఉపయోగించి చెట్టును బాగా పెంచుకోవచ్చు. ఆవు పేడ, పొటాషియం కలిగిన సహజ ఎరువులను వాడితే చెట్టు ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతారు.
(5 / 6)
నిమ్మ చెట్లకు సూర్యరశ్మి ఎంత ఎక్కువగా పడితే అంత బాగా పెరుగుతాయి. కాబట్టి సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశంలో నాటాలి.
ఇతర గ్యాలరీలు