తెలుగు న్యూస్ / ఫోటో /
Green pea:చలికాలంలో పచ్చి బఠానీలు అధికంగా తింటే సమస్యా?
- Green pea side effects: చలికాలంలో పచ్చి బఠానీలు అధికంగా లభిస్తాయి. వాటిని ఎంతో మంది ఇష్టపడతారు. ఎన్నో రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే వీటిని అధికంగా తింటే అనర్థమా?
- Green pea side effects: చలికాలంలో పచ్చి బఠానీలు అధికంగా లభిస్తాయి. వాటిని ఎంతో మంది ఇష్టపడతారు. ఎన్నో రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే వీటిని అధికంగా తింటే అనర్థమా?
(1 / 6)
చలికాలంలో అధికంగా లభించే ఆహారాల్లో పచ్చిబఠానీలు ఒకటి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటితో ఎన్నో టేస్టీ వంటలు చేసుకోవచ్చు. అందుకే పచ్చి బఠానీల వినియోగం అధికంగా ఉంటుంది. (pixabay)
(2 / 6)
పచ్చిబఠానీలో బిర్యానీలు,కూరలు, దోశెలు, వేపుళ్లు చేస్తారు. ఏం చేసినా టేస్ట్ అదిరిపోతుంది. అలాగని మరీ ఎక్కువ తింటే అనర్ధాలు తప్పవు. (Pixabay)
(3 / 6)
అధిక మొత్తం పచ్చి బఠానీలకు తినడం వల్ల కొందరిలో పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. వీటిలో లెక్టిన్, ఫైటిక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గ్యాస్ ఉత్పత్తి కావడానికి కారణం అవుతాయి. (Pixabay)
(4 / 6)
కాబట్టి ప్రతి రోజూ పచ్చి బఠానీలు తినకూడదు. రెండు మూడురోజులకోసారి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
(5 / 6)
వీటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ శరీరంలో ఇనుము, కాల్షియం, జింక్ శోషణను తగ్గిస్తుంది. కాబట్టి అధికంగా తినకూడదు.
ఇతర గ్యాలరీలు