TG Liquor Price Hike : మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా.. మద్యం ధరలు పెంచేందుకు సర్కారు వారు సిద్ధం!
- TG Liquor Price Hike : మందుబాబులకు తెలంగాణ సర్కారు షాకివ్వనుంది. మద్యం పెంచే ఆలోచన చేస్తోంది. అది కూడా అతి త్వరలోనే కావడం గమనార్హం. ఒకవేళ ధరలు పెంచాల్సి వస్తే.. 10 నుంచి 15 శాతం మేర పెరగనున్నాయి. దీంతో మధ్యతరగతి మద్యం ప్రియులపై భారం పెరగనుంది.
- TG Liquor Price Hike : మందుబాబులకు తెలంగాణ సర్కారు షాకివ్వనుంది. మద్యం పెంచే ఆలోచన చేస్తోంది. అది కూడా అతి త్వరలోనే కావడం గమనార్హం. ఒకవేళ ధరలు పెంచాల్సి వస్తే.. 10 నుంచి 15 శాతం మేర పెరగనున్నాయి. దీంతో మధ్యతరగతి మద్యం ప్రియులపై భారం పెరగనుంది.
(1 / 6)
మద్యం ప్రియులకు కిక్కు దించే సమాచారం వస్తోంది. మద్యం ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి.. ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(2 / 6)
తెలంగాణ సచివాలయంలో ఇటీవల ఎక్సైజ్ అధికారులు సమావేశమై ధరల పెంపు అంశంపై చర్చించారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(3 / 6)
ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15 శాతం వరకు మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. నిరుపేదలు ఎక్కువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(4 / 6)
పంచాయతీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా పాత రేట్లతోనే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం తయారీ, సరఫరా చేస్తున్న కంపెనీలు.. లిక్కర్ రేట్లపై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)(5 / 6)
తెలంగాణలో బీర్ల రేట్లు పెంచాలని కంపెనీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఓ కంపెనీ బీర్ల సరఫరా ఆపేస్తున్నామని లేఖ రాసింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై కదలిక వచ్చింది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
(istockphoto)ఇతర గ్యాలరీలు