తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. ఎంపికకు ముందే లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే స్టీల్, సిమెంట్!
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్కీమ్ లబ్ధిదారులకు వీలైనంత ఎక్కుల మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కానుంది. దీనికి ముందే రేవంత్ సర్కారు మరో కీలక ప్రయత్నం చేస్తోంది.

(1 / 5)
తెలంగాణలో సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
(2 / 5)
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రిని అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సిమెంట్, స్టీల్ వంటి వాటిని లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
(3 / 5)
ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా సిమెంట్ ధర రూ. 260 పైగానే ఉంది. బ్రాండ్‌ను బట్టి ఆ ధర ఎక్కువగానే ఉంది. ఇక స్టీల్ ధర కూడా టన్న రూ.54 వేలు పైగానే ఉంది. ఈ నేపథ్యంలో పేదలపై మరింత ఆర్థిక భారం పడకుండా రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా.. తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ ఇవ్వాలని భావిస్తోందని తెలిసింది.
(4 / 5)
లబ్ధిదారులకు తక్కువ ధరకే అందించేందుకు.. సిమెంట్, స్టీల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ.. ప్రభుత్వ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు